ప్రతి రోజు ఈ పొడిని తీసుకుంటే.. ఇక వైద్యుని అవసరమే ఉండదు..

ఈ మధ్య కాలంలో వైరస్లు, ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా పెరిగిపోయాయి.అయితే వాటిని ఎదుర్కోవడానికి మనం తరచుగా డాక్టర్ల దగ్గరికి వెళ్లి యాంటీసెప్టిక్ ట్యాబ్లెట్లను వాడుతూ ఉంటాం.

 Triphala Churnam Health Benefits Details, Triphala Churnam Health Benefits, Trip-TeluguStop.com

అయితే యాంటీసెప్టిక్ ట్యాబ్లెట్లను వాడడం కన్నా యాంటీసెప్టిక్ గుణాలు ఉండే ఆయుర్వేద పదార్థాలను తీసుకోవడం చాలా మంచిది.అయితే ఆయుర్వేద వైద్యంలో త్రిఫల చూర్ణానికి ఎంతో ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది.

అయితే ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమంతో ఉన్న ఓ త్రిఫల చూర్ణం వాత, పిత్తా, కఫా లాంటి సమస్యలకు దివ్య ఔషధంగా చెప్పవచ్చు.అయితే ప్రతిరోజు ఈ త్రిఫల చూర్ణం తీసుకుంటే ఇక వైద్యుడితో అవసరమే ఉండదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

అయితే ఈ చూర్ణానికి సమస్త రోగాలను తగ్గించే అద్భుతమైన శక్తి ఉంది.అయితే ప్రతిరోజు ఈ చూర్ణాన్ని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అర స్పూన్ కలిపి రాత్రంతా ఉంచి మరుసటి రోజు తాగాలి.

ఇలా భోజనం చేయడానికి ముందు 30 నుంచి 60 నిమిషాల ముందే ఈ మిశ్రమాన్ని తాగాలి.ఇలా తాగడం వలన శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

అదేవిధంగా ఎర్ర రక్తకణాలు కూడా పెరుగుతాయి.అలాగే గ్యాస్ కడుపుబ్బరం మలబద్ధకం లాంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.

అదేవిధంగా ఆకలి లేని వారికి ఆకలి పుట్టేలా ఇది సహాయపడుతుంది.అదేవిధంగా శరీరం నుండి విష పదార్థాలను బయట పంపేందుకు సహాయపడుతుంది.అదేవిధంగా కాలేయానికి ఎలాంటి సమస్యలు రాకుండా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.ఇక ఊపిరితిత్తులలో తేమ, శ్లేష్మం  యొక్క సమతుల్యతను కాపాడుతుంది.అలాగే శ్వాసకోశ వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది.అంతేకాకుండా కండరాల స్థాయిని  కాపాడి, సన్నమైన కండరాల బలాన్ని పెంచి దృఢంగా మారుస్తుంది.

అదేవిధంగా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.అలాగే రక్తపోటు నియంత్రణలో ఉండేలాగా చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube