తమిళనాట ఎప్పుడు రాజకీయం విచిత్రంగా ఉంటుంది.రాష్ట్రం జోలికి రానంత వరకూ ప్రతిపక్షం, ప్రధాన పక్షం ఉంటాయి.
ఒక్కసారి వాళ్ల సంస్కృతి, సంప్రదాయం జోలికి వస్తే.మాత్రం అంతా ఏకమవుతారు.
ఇది ఇప్పటి ఆనవాయితీ కాదు. కరుణానిధి, జయలలితల కంటే ముందు నుంచే ఉంది.
ఒక పార్టీ అంటే ఒక పార్టీకి పడకపోయినా.తమిళ విధానాలు మాత్రం తప్పనిసరిగా పాటించాల్సిందే.
అది ఎంత చిన్నదైనా.ఎంత పెద్దదైనా అన్ని పార్టీలు కలసి కొట్లాడుతాయి.
జెల్లికట్టు వివాదం తెరమీదకు వచ్చినప్పుడు ఏకంగా అన్ని పార్టీలు ఏకమై.ఢిల్లీ బాట పట్టి.ఒక ఆర్డినెన్స్ ను కేంద్రంతో తీసుకుని మరీ వచ్చారు.జంతు ప్రేమికుల విన్నపంతో.
జెల్లికట్టును రద్దు చేస్తూ.సుప్రీం తీర్పు ఇచ్చినా అది పక్కన పెట్టి మరీ.వారి పంతాన్ని నెగ్గించుకున్నారు.తర్వాత మహా మహులు కాలం చెల్లి వెళ్లిపోయిన తర్వాత స్టాలిన్ అధికారంలోకి వచ్చారు.
అప్పటి నుంచి రాజకీయాలు మరోమలుపు తిరిగాయి.ఎన్నికల్లో పెద్ద మెజారిటితో అధికారంలోకి రాలేక పోయినా.
తన విధానంతో అందరి అభిమానాన్ని చూరగొన్నారు.
ఇక జయలలిత పేరుతో ఉన్న ఎన్నో పథకాలకు పేర్లను మార్చకుండా వాటిని అలాగే కొనసాగిస్తూ.కొత్త పంథాకు తెరలేపారు.అంతే కాదు.
తమిళ ప్రజల జోలికి వస్తే.ప్రతిపక్షాలను సైతం పక్కన పెట్టుకుని ఢిల్లీకి వెళతారు.
ఏకంగా ప్రధాని స్టేజ్ మీద ఉండగానే.తమిళులకు జరుగుతున్న అన్యాయం పై కడిగిపారేశారు.
తమిళులు అంటే వారి రూటే సపరేటు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.ఇప్పుడు సోషల్ మీడియాలో.
స్టాలిన్ ను చూసి మన సీఎంలు చాలా నేర్చుకోవాలని నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.నిజమే తన రాష్ట్ర ప్రజల కోసం రాజకీయాలను పక్కన పెట్టి కొట్లాడే నేతలెంత మంది ఉంటారు మరి.నిజంగా మనోళ్లు ఆయన్ను చూసి చాలా నేర్చుకోవాలి.