ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా ‘RAPO20‘.ఇటీవలే బోయపాటి బాలయ్యతో అఖండ సినిమా తీసి ఘన విజయం అందుకుని తన నెక్స్ట్ సినిమా కోసం మరింత జోష్ గా సిద్ధం అవుతున్నాడు.
రామ్ పోతినేని ఎనర్జీ బోయపాటి యాక్షన్ తో మిక్స్ అయితే ఇక అదిరిపోయే మాస్ ప్రాజెక్ట్ రెడీ అవుతుంది.
అందుకే ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఈ సినిమాపై అంచనాలు పెరిగి పోయాయి.
ఇది పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుండడంతో ఫుల్ ఫోకస్ పెట్టి తెరకెక్కించ బోతున్నారు.ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల నటించ బోతుంది అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.
ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేసి శరవేగంగా షూట్ జరుపు తున్నారు.ఇది పక్కన పెడితే తాజాగా ఈ సినిమా నుండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.
ఈ సినిమా ఇంటర్వెల్ పై ఒక క్రేజీ అప్ డేట్ వినిపిస్తుంది.ఈ సినిమాలో రామ్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులకు గొప్ప థ్రిల్ ఇస్తుందని.
ముఖ్యంగా రామ్ క్యారెక్టర్ లోని వేరియేషన్ ను ఎవ్వరూ ఉహించలేరని టాక్.

బోయపాటి చేస్తున్న ఏ సినిమాలో అయినా మాస్ ఎలిమెంట్స్ పక్కాగా ఉంటాయి అనే విషయం తెలిసిందే.మరి రామ్ సినిమాలో కూడా పక్కా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మలచాలని ప్లాన్ చేస్తున్నాడట.మరి రామ్ బాడీ లాంగ్వేజ్ కూడా సరిపడా ప్లాన్ చేసాడని అఖండ వంటి బ్లాక్ బస్టర్ ఈసారి కూడా ఖాయం అని అంటున్నారు.
చూడాలి రామ్ కు బోయపాటి ఎలాంటి హిట్ ఇస్తాడో.ఇక ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై నిర్మిస్తున్నాడు.







