టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఇకపోతే ఇటీవలే ప్రభాస్ బాలయ్య బాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె షోలో సందడి చేసిన విషయం తెలిసిందే.
ఇక ఈ ఎపిసోడ్ గతంలో ఏ ఎపిసోడ్ కి రానన్ని వ్యూస్ ని రాబడు రాబడుతోంది.అంతేకాకుండా ఇప్పటికే ఒక ఎపిసోడ్ పూర్తి కాగా అది దాదాపుగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దూసుకుపోతోంది.
ఒక ఎపిసోడ్ ఏ కాదు ఇంకా మీరు చూడాల్సింది చాలా ఉంది అంటూ ఆహా మరొక రెండో ఎపిసోడ్ ప్రోమో విడుదల చేసింది.
అందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఆ ప్రోమోలో గోపీచంద్ ప్రభాస్ లను ఎప్పటిలాగే బాలయ్య బాబు ఒక రేంజ్ లో ఆటాడుకున్నాడు.ఇద్దరు హీరోయిన్ల ఫోటోలు చూపించి వీరిలో ఎవరితో మీ ఫోన్లు ఎక్స్చేంజ్ చేస్తారని అడగగా, అప్పుడు గోపీచంద్ తనకు పెళ్లి అయిపోయిందని తప్పించుకునేందుకు ప్రయత్నించాడు.
ఇప్పుడు బాలయ్య బాబు 2008లో ఒక హీరోయిన్ విషయంలో గొడవ పడ్డారని కూపి లాగే ప్రయత్నం చేయగా వెంటనే ప్రభాస్ నేనైతే పడలేదు నీ గురించి చెప్పురా అంటూ గోపిచంద్ నీ ఇరికించేశాడు.అనంతరం నయనతార తమన్నా ఫోటోలు చూపించి వీరిలో ఎవరిని షాపింగ్ కి తీసుకుని వెళ్తారు అని బాలయ్య బాబు ప్రశ్నించగా, ఇద్దరిని తీసుకొని వెళ్తాను అంటూ సమాధానం ఇచ్చాడు ప్రభాస్.

ఆ తర్వాత బాలకృష్ణ రెబల్ స్టార్ నారీ నారీ నడుమ మురారి అంటూ స్టేజి పై నవ్వులు పోయించాడు.అందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ జనవరి 6న విడుదల కానుంది.ఆహా అందుకు సంబంధించిన వీడియోని ట్విట్టర్లో షేర్ చేస్తూ మీరు చూసింది కూసంత, చూడాల్సింది కొండంత అంటూ క్యాప్షన్ ని జోడించి వీడియోని విడుదల చేసింది.అలాగే మరొక వీడియోని షేర్ చేస్తూ ప్రభాస్ బాలకృష్ణ ఫోటోలని పెడుతూ ఆ వీడియోలో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ అని ఒక మ్యూజిక్ ని యాడ్ చేశారు.







