తెలుగులో ఎక్కువ సినిమాలలోనే నటించినా సరైన గుర్తింపును సొంతం చేసుకోని హీరోయిన్లలో ఐశ్వర్యా రాజేష్ ఒకరు.రిపబ్లిక్, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకోగా ఈ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ అయ్యాయి.
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఐశ్వర్యా రాజేష్ కు సినిమా ఆఫర్లు ఎక్కువగా రావడం లేదు.
డిసెంబర్ చివరి వారంలో ఐశ్వర్యా రాజేశ్ డ్రైవర్ జమున అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అస్సలు అందుకోలేదు.
తాజాగా ఐశ్వర్య రాజేశ్ తను చేసిన మంచి పని ద్వారా వార్తల్లో నిలిచారు.ట్రెడిషనల్ రోల్స్ కు ప్రాధాన్యత ఇస్తున్న ఐశ్వర్య రాజేశ్ డ్రైవర్ జమున ప్రమోషన్స్ లో భాగంగా 40 మంది ఆటో డ్రైవర్లను పిలవడం జరిగింది.
ప్రమోషన్స్ కు హాజరైన 40 మంది మహిళలలో ఒక మహిళకు ఐశ్వర్య ఆటోను గిఫ్ట్ గా ఇచ్చారు.
కొత్త ఆటోను కొని బహుమతిగా ఇచ్చిన ఐశ్వర్యా రాజేశ్ గొప్పదనాన్ని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.
ఐశ్వర్య తర్వాత ప్రాజెక్ట్ లు సక్సెస్ కావాలని తెలుగులో కూడా ఈ హీరోయిన్ బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.చాలామంది హీరోయిన్లతో పోలిస్తే రెమ్యునరేషన్ తక్కువ కావడం ఐశ్వర్యకు ప్లస్ అయింది.
టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రాబోయే రోజుల్లో ఐశ్వర్యకు ఆఫర్లు వస్తాయేమో చూడాలి.

ఛాన్స్ వస్తే డీ గ్లామర్ రోల్స్ లో నటించడానికి కూడా ఐశ్వర్యా రాజేశ్ ఆసక్తి చూపిస్తున్నారు.నటి ఐశ్వర్యా రాజేశ్ గొప్ప మనస్సును చాటుకున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.కెరీర్ ను ఐశ్వర్యా రాజేశ్ మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.







