పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ లో ముందు వరుసలో ఉన్న చిత్రం ”హరిహర వీరమల్లు”.భీమ్లా నాయక్ తర్వాత చాలా గ్యాప్ వచ్చిన ఈయన తన రాజకీయాలపై పెట్టిన ఫోకస్ సినిమాలపై పెట్టక పోవడంతో ఒక్క సినిమాను కూడా రిలీజ్ కు రెడీ చెయ్యలేదు.ప్రెజెంట్ పవన్ చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి.అందులో ”హరిహర వీరమల్లు” ఒకటి.ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
ఈ సినిమా గత రెండేళ్ల నుండి షూటింగ్ జరుపు కుంటుంది.
కానీ ఏదో ఒక అడ్డంకి అయితే ఎదురవుతూనే ఉంది.దీంతో ఎప్పుడు ఈ షూటింగ్ వాయిదా పడుతూనే వస్తుంది.
పవన్ రాజకీయాల కోసం అని షూటింగ్ కు బ్రేక్ వేయడంతో ఇంకా ముగింపు దశకు చేరుకోలేక పోతుంది.భారీ పాన్ ఇండియా మూవీగా అత్యుత్తమ సాంకేతిక విలువలతో హై బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రెండు గ్లిమ్స్ టీజర్స్, పోస్టర్ వంటివి రిలీజ్ అయ్యాయి.
ఈ అప్డేట్స్ అన్ని పవన్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టు కుంటాయి.అయితే తాజాగా నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమా గురించి మాట్లాడారు.డిసెంబర్ 31న ఖుషి స్పెషల్ షోలు వేసిన విషయం తెలిసిందే.ఈ షోను వీక్షించిన నిర్మాత ఏ ఎం రత్నం మాట్లాడుతూ.
హరిహర వీరమల్లు సినిమా షూట్ చాలా వరకు పూర్తి అయ్యింది.ఇంకొంత షూట్ తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ వంటివి మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు.

పవన్ ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ అందరిని ఆకట్టుకునేలా అద్భుతంగా క్రిష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని ఈ సినిమా టీజర్ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రాబోతుందని హింట్ ఇచ్చారు.దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్టు తెలుస్తుంది.చూడాలి మరి ఈ సినిమా టీజర్ ఎప్పుడు వస్తుందో.ఇక ఏ ఎం రత్నం భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.







