తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బండ్ల గణేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.బండ్ల గణేష్ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటారని విషయం మనకు తెలిసిందే.
ఈయన ఏదైనా ఒక కార్యక్రమంలో పాల్గొన్నారంటే తప్పనిసరిగా ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు.ఈ క్రమంలోనే తాజాగా ఈయన రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.
ఈ కార్యక్రమంలో భాగంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ రవితేజ గురించి కొన్ని విషయాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా రవితేజ గురించి మాట్లాడుతూ కష్టం తెలిసిన హీరో రవితేజ.
సినిమా అవకాశాల కోసం అందరూ ఒక రెండు మూడు సంవత్సరాలు ప్రయత్నం చేస్తూ ఉంటారు.అదృష్టం కలిసి వస్తే వాళ్ళు మెగాస్టార్లు సూపర్ స్టార్లు అవుతారు.కానీ పదేళ్లపాటు చచ్చినా బతికిన, ఆఖరికి ప్రొడక్షన్ అయినా సరే, అసిస్టెంట్ డైరెక్టర్ అయినా సరే నేను చనిపోవడం ఇక్కడే అని డిసైడ్ అయ్యి విజయాన్ని సాధించి వందల మందికి అవకాశం కల్పించినవ్యక్తి రవితేజ అంటూ ఈ సందర్భంగా రవితేజ గురించి గొప్పగా చెప్పారు.అయితే ఈయన అదృష్టం కలిసి వచ్చి సూపర్ స్టార్లు మెగాస్టార్లు అవుతారన్న విషయం మాత్రం హాట్ టాపిక్ గా మారింది.

ఈ క్రమంలోనే బండ్ల గణేష్ చేసిన ఈ వ్యాఖ్యలపై షకలక శంకర్ స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు.షకలక శంకర్ నటించిన రాజయోగం థాంక్స్ మీట్ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ…అందరికీ నమస్కారం అని చెబుతూ కొంతమంది కొన్ని సంవత్సరాలైనా మాట్లాడటం చేతకాదు మొన్న ఒక ప్రొడ్యూసర్ మాట్లాడారు ఆయనకు శతకోటి వందనాలని పరోక్షంగా బండ్ల గురించి మాట్లాడారు.ఏదో రెండు మూడేళ్లు ట్రై చేస్తే అదృష్టం కొద్ది సూపర్ స్టార్ లో మెగాస్టార్లు అవుతారని కామెంట్ చేశారు.అదృష్టం కొద్ది ఎవరూ కూడా సూపర్ స్టార్లు మెగాస్టార్లు కారని అలా కావాలంటే ఎన్నో పగలు రాత్రి అని తేడా లేకుండా కష్టపడాల్సి ఉంటుందని ఈ సందర్భంగా షకలక శంకర్ బండ్ల గణేష్ కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







