అడవి శేష్ హీరో గా వచ్చిన గూఢచారి చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.శోభిత ధూళిపాల హీరోయిన్ గా ఆ సినిమా లో నటించింది.గూఢచారి సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యం లో ఇప్పుడు ఆ సినిమా కు సీక్వెల్ తీసుకొచ్చేందుకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రెడీ అయ్యింది.2022 సంవత్సరంలో మేజర్ మరియు హిట్ 2 సినిమా లతో సక్సెస్ లను దక్కించుకున్న అడవి శేష్ గూఢచారి సీక్వెల్ లో నటించబోతున్నాడు.మొదటి పార్ట్ లో నటించిన సమయంలో తీసుకున్న పారితోషికం తో పోల్చితే రెండవ పార్ట్ లో నటించబోతున్నందుకు అడవి శేష్ తీసుకోబోతున్న పారితోషకం దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ అంటూ సమాచారం అందుతుంది.
2022 సంవత్సరం లో అడవి శేష్ రెండు భారీ విజయాలను సొంతం చేసుకోవడంతో ఆయన ఏకంగా తన పారితో షికాన్ని 8 నుండి 10 కోట్ల రూపాయలకు పెంచేశాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.మేజర్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ హీరో గా ఈయన గుర్తింపు దక్కించుకున్నాడు.అందుకే ఈయన నటించిన ప్రతి ఒక్క సినిమా ను ఉత్తరాది ప్రేక్షకులు కూడా చూడాలని ఆశ పడుతున్నారు.
హిట్ 2 చిత్రం అక్కడ కూడా విడుదల చేసి మంచి సక్సెస్ దక్కించుకున్న విషయం తెలిసిందే.

అందుకే గూఢచారి సినిమా కూడా తెలుగు తో పాటు అక్కడ కూడా విడుదల అవ్వబోతుంది.ఆ కారణంగానే ఈయన కు భారీ పారితోషికాన్ని ఇచ్చేందుకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు ఓకే చెప్పినట్లు సమాచారం అందుతుంది.ఇక నుండి అడవి శేష్ తో ఏ సినిమా తీయాలన్నా కూడా 10 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం ఇవ్వాల్సి ఉంటుంది.గూడచారి 2 సినిమా హిట్ అయితే కచ్చితంగా ఆయన పారితోషికం రూ.15 కోట్ల నుండి 20 కోట్లకు పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







