కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది.మున్సిపాలిటీలోని సమస్యలపై టీడీపీ కౌన్సిలర్ నిలదీయగా.
నోరు మూసుకో అంటూ వైసీపీ మహిళా కౌన్సిలర్ వరలక్ష్మీ అన్నారని తెలుస్తోంది.దీంతో వైసీపీ, టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదం చెలరేగింది.
ఈ క్రమంలోనే టీడీపీ కౌన్సిలర్లు కౌన్సిల్ హాలులో కింద కూర్చొని నిరసనకు దిగారు.







