సంక్రాంతికి దుమ్ములేపుదాం అంటున్న థమన్.. పోస్ట్ వైరల్!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ”వీరసింహారెడ్డి”.ఈ సినిమాను యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్నాడు.

 Thaman Hyping Up Veera Simha Reddy Once Again Details, Veera Simha Reddy, Nandam-TeluguStop.com

క్రాక్ వంటి సినిమాతో మాస్ హిట్ అందుకున్న గోపీచంద్ ఆ తర్వాత ఏకంగా బాలయ్యనే లైన్లో పెట్టి ఈయనతో సినిమా చేసాడు.మరి ఈ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేసి సంక్రాంతి బరిలో దింపబోతున్నాడు.

బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న మోస్ట్ ఏవైటెడ్ క్రేజీ సినిమా ‘వీరసింహారెడ్డి’.మరొక 15 రోజుల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

దీంతో ఎప్పుడెప్పుడు సంక్రాంతి పండుగకు వస్తుందా అని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలోనే బాలయ్య కూడా ఈ సినిమా ప్రొమోషన్స్ కోసం రెడీ అయ్యాడు.

”వీరసింహారెడ్డి” ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ఇప్పటికే వరుస సాంగ్స్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు.జనవరి ఫస్ట్ వీక్ నుండి బాలయ్య వరుస ఇంటర్వ్యూలలో పాల్గొన బోతున్నాడు అని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా కోసం వీలైనంత ప్రొమోషన్స్ చేయడానికి అందరు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంగీతం అందించిన థమన్ కూడా వీరసింహారెడ్డి కోసం ప్రొమోషన్స్ చేస్తున్నారు.

తాజాగా థమన్ ఈ సినిమా గురించి పుట్టింట పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.”కలుద్దాం.దుమ్ము లేపుదాం.జై బాలయ్య.జనవరి 12.ఈసారి థియేటర్స్ ప్లీజ్ డోంట్ కంప్లైంట్.ప్రిపేర్ అవ్వండి”.అంటూ ఈయన చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారిపోయింది.ఈసారి వీరసింహారెడ్డి సినిమాలో బీజీఎమ్ తో థియేటర్స్ దద్దరిల్లిపోవడం ఖాయం అంటూ హింట్ ఇచ్చేసాడు.చూడాలి అఖండ వంటి బీజీఎమ్ ఈ సినిమాకు అందించాడో లేదో.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube