టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ ఇండస్ట్రీకి తమన్నా ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్లు పూర్తి అవుతున్నా కూడా ఇప్పటి అందాన్ని మెయింటైన్ చేస్తూ వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది.
అలాగే భాషతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటోంది.కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది తమన్నా.
ఇకపోతే తమన్నా ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
చేతినిండా పలు ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతోంది.
ఇక ఈ ముద్దుగుమ్మ అందం విషయానికి వస్తే హ్యాపీడేస్ సినిమాలో ఎలా ఉందో ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ యువతని ఆకట్టుకుంటోంది.ఇకపోతే ప్రస్తుతం తమన్న బాలీవుడ్లో వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీబిజీగా ఉంది.
ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.ఇది ఇలా ఉంటే తాజాగా తమన్నా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది.ఈ సందర్భంగా ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రొమాంటిక్ సన్నివేశాలు చేసినప్పుడు హీరోల బిహేవియర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తమన్నా మాట్లాడుతూ.రొమాంటిక్ సన్నివేశాలు షూట్ చేసే సమయంలో హీరోయిన్లు ఎలా అనుకుంటారో హీరోలు కూడా అదే విధంగా టెన్షన్ పడతారు అని తమన్నా తెలిపింది.ఇక మొహమాటంగా ఉండే హీరోలు అయితే అటువంటి సన్నివేశాలలో మాట్లాడడానికి కూడా ఎక్కువగా ఇష్టపడరు అని తెలిపింది.
ఇంతమంది హీరోలు అయితే రొమాంటిక్ సీన్లు నటించడానికి అస్సలు ఇష్టపడరని ఆమె తెలిపింది.ఎందుకంటే షూటింగ్లో అంత మంది ఉండగా అందరి ముందు రొమాంటిక్ సీన్స్ చేయడం అంటే సాహసమే అని చెప్పాలి అని తమన్నా చెప్పుకొచ్చింది.
ఇకపోతే గత కొంతకాలంగా తమన్నా పెళ్లికి సంబంధించిన అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.మూడుపదుల వయసు దాటుతున్న తమన్నా ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో అభిమానులు ఎప్పుడు అని ప్రశ్నిస్తున్నారు.