బెంగాల్ సీఎం మమత బెనర్టీ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.ప్రధాన మంత్రి నరేంద్ర మోది అంటే ఎప్పుడూ ఒంటి కాలి మీద లేచే ఆమే.
ఇప్పుడు ఒక దానికి తెగ భయపడుతోంది.జైశ్రీరాం అనే నినాదం ఎక్కడ వినిపించినా మారు మాట్లాడకుండా.
సెలెంట్ గా తప్పుకుంటున్నారు.ఏ సభలో జై శ్రీరాం అన్నా.
ఆమె సైలెంట్ అయిపోతున్నారు.తాజాగా ఆమె కొల్ కత్తాలో పర్యటిస్తున్నప్పుడు.
అక్కడ అదే నినాదాలు వినిపించాయి.దాంతో ఆమె ఏం మాట్లాడకుండానే ముందుకు సాగింది.
కనీసం వారివైపు కూడా చూడలేదు.
పోయిన సారి బెంగాల్ ఎన్నికల్లో సైతం ఆమెకు ఇవే ఇబ్బందులు ప్రతీ మీటింగ్ లోనూ రావడంతో.
ఆమె దానికి కౌంటర్ గా జై దుర్గా నినాదం ఎత్తుకున్నారు.ప్రజలు విభజించడానికి బీజేపీ ఇదంతా చేస్తోందని చాలా మీటింగ్ లలో మాట్లాడినా.
ఎప్పుడూ దాన్ని ఖండించలేదు.మరి ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఎందుకు ఆ నినాదాలకు భయపడుతున్నారనేది అర్థం కాని చిక్కు ప్రశ్నగా మారింది.
అయితే బాంగ్లాదేశ్ సరిహద్దు గల చాలా ప్రాంతాల్లో ముస్లిం ఓట్లు గణనీయంగా ఉన్నాయి.ఇక్కడ జై శ్రీరాం నినాదాన్ని సపోర్టు చేస్తే అది మొదటికే మోసం వస్తుందని భయపడుతున్నట్టు కనిపిస్తోంది.

అయితే అందుకు కారణం ఓట్ల పరంగానే కాకుండా.అది బీజేపీ ఉపయోగించే పెద్ద నినాదం కావడంతోనే ఇలా భయపడుతున్నట్టు కనిపిస్తోంది.ఆ నినాదాన్ని తాను సపోర్టు చేస్తే బీజేపీని ప్రమోట్ చేసినట్టు అవుతుందని భయపడుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.మొత్తానికి దేనికీ భయపడని బెంగాల్ బెబ్బులి.జై శ్రీరాం నినాదానికి మాత్రం తెగ భయపడుతోందనేది మాత్రం వాస్తవం.







