ఈ మ్యాజికల్ మాస్క్ వేసుకుంటే ఉదయానికి ముఖం సూపర్ గ్లో గా మారుతుంది!

సాధారణంగా కొందరి ముఖ చర్మం ఉదయం నిద్ర లేచే సమయానికి చాలా డల్ గా, నిర్జీవంగా మారుతుంది.అటువంటి ముఖ చర్మంతో బయటికి వెళ్లడానికి ఏ మాత్రం ఇష్టపడరు.

 This Magical Mask Will Make Your Face Super Glow, Magical Mask, Glowing Skin, Sk-TeluguStop.com

అందులోనూ ఏదైనా మీటింగ్ లేదా ఫంక్షన్ ఉందంటే బయట కాలు పెట్టడానికి కూడా సంకోచిస్తారు.నిద్రను నిర్లక్ష్యం చేయడం, శరీరానికి సరిపడా నీటిని అందించకపోవడం, ఆహారపు అలవాట్లు, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల ఉదయం నిద్ర లేచే సమయానికి ముఖం వాడిపోయినట్లు ఉంటుంది.

అయితే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ మాస్క్ ను నైట్ నిద్రించే ముందు వేసుకుంటే ఉదయానికి మీ ముఖం సూపర్ గ్లోయింగ్‌గా మరియు షైనీగా మారడం ఖాయం.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మ్యాజికల్ మాస్క్ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్‌ వాటర్ ను వేసుకోవాలి.వాటర్ బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.ఒక గ్రీన్ టీ బ్యాగ్ ను అందులో వేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న గ్రీన్ టీ ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్‌ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ వెజిటేబుల్ గ్లిజరిన్, ఏడు నుంచి ఎనిమిది టేబుల్ స్పూన్లు గ్రీన్ టీ వేసుకుని అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమంలో షీట్ మాస్క్ ను నానబెట్టాలి.

ఇలా నాన‌బెట్టుకున్న షీట్ మాస్క్ ను ముఖానికి పెట్టుకోవాలి.నైట్ నిద్రించే ముందు ముఖానికి ఉన్న మేకప్ మొత్తాన్ని తొలగించి వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఆపై పైన చెప్పిన విధంగా షీట్ మాస్క్ ను వేసుకొని నిద్రించాలి.ఇలా చేస్తే కనుక ఉదయానికి చర్మం గ్లోయింగ్‌గా మారుతుంది.డ‌ల్‌ స్కిన్ అన్న మాటే అనరు.ఈ మ్యాజికల్ మాస్క్ ను రోజు వేసుకుంటే కనుక చర్మం యవ్వనంగా మెరుస్తుంది.ముడతలు త్వరగా రాకుండా ఉంటాయి.చర్మంపై మొండి మచ్చలు ఏమైనా ఉన్నా స‌రే దూరం అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube