భానుమతి నిజంగా ఒక శాపగ్రస్తురాలు అంటాడు కాట్రగడ్డ మురారి. ఎందుకంటే ఎన్నో వందల కోట్ల ఆస్తి ఉంది, మద్రాసు నగరంలో 70 ఎకరాల స్థలం ఉంది, అయినా కూడా ఆ తన సొంత గదిలో ఏసీ కూడా వేసుకోలేదు భానుమతి.
ఇక శాపం కాక ఏమంటారు చెప్పండి.సినిమాల్లో ఎంతో సంపాదించి నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా కోట్ల రూపాయలతో పాటు మంచి పేరు సంపాదించుకున్న మహానటి భానుమతి.
భానుమతి రామకృష్ణను ప్రేమించి పెళ్లి చేసుకుంది వారి జీవితం ఎంతో చక్కగా గడిచింది రామకృష్ణ ఉన్నంతకాలం కూడా ఆమెకు ఎలాంటి లోటు లేదు.వీరిద్దరికీ ఒక్కగానొక్క సంతానం భరణి.
కొడుకుని డాక్టర్ ని చేసింది, మరొక డాక్టర్ కి ఇచ్చి పెళ్లి చేసింది.వారిద్దరూ కలిసి అమెరికా వెళ్ళిపోయి స్థిరపడ్డారు వారికి ఇద్దరు పిల్లలు.
కొడుకు, మనవళ్లు అమెరికాలోనే ఉండడంతో ఆమె ఇండియాలో ఒంటరిగానే ఉండేది.లంకంత ఇంట్లో, కోట్ల సంపాదన మధ్య థైరాయిడ్ వ్యాధితో బాధపడుతూ భారీ ఖాయం కూడా ఉండటం తో ఎప్పుడు గది దాటి బయటకు వచ్చేది కాదు.
ఇంటి నిండా ఏసీలు ఉన్న ఆమె గదిలో కనీసం ఫ్యాన్ కూడా వేసుకునేది కాదు.ఒంటరితనానికి అలవాటు పడింది అలా భానుమతి చివరి రోజు నువ్వు చాలా కష్టంగానే వెల్లదీసింది.
ఒంట్లో ఓపిక ఉన్నన్ని రోజులు కూడా నటించింది.హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, బామ్మ గా ఆమె చెయ్యని వేషం లేదు తీయని సినిమా లేదు.
కానీ ఎందుకో ఆమె అమెరికా వెళ్లి తన కుటుంబంతో కూడా ఉండడానికి ఇష్టపడేది కాదు.

అందుకే ఒక్కోసారి డబ్బు మాత్రమే మనుషులను బ్రతికించదు.ఇంతకన్నా కూడా ప్రేమించే వారు ఉంటేనే మనం ప్రశాంతంగా జీవించగలం.ఈ మాట కచ్చితంగా భానుమతికి వర్తిస్తుంది.
ఇక ఈ విషయాలన్నీ కూడా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాం లో నిర్మాత కాట్రగడ్డ మురారి అభిమానులతో పంచుకున్నారు.ఆమె నెత్తి మీద పెట్టుకొని పూజ పూజించాల్సిన ఒక దేవత అంటూ కొనియాడారు.
కానీ ఆవిడకు శాపం తగిలినట్టుగా చివరి రోజులు సరిగ్గా జరగలేదు అంటూ బాధపడ్డారు.నిజమే కదా భానుమతి లాంటి మహానటికి అంతకన్నా మంచి జీవితం దొరికితే బాగుండేది.
జీవితం అంతా కూడా నిక్కచ్చిగా బ్రతికిన భానుమతి చివరి రోజులు హృదయ విదారకంగా జీవించడం ఎంతో బాధ కలిగించే విషయం.







