2022 ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ హిట్ లు చాలానే వచ్చాయి.ఈ సూపర్ హిట్ సినిమాలు మన ఇండస్ట్రీకి మంచి పేరు తెచ్చాయి.
బాలీవుడ్ కంటే కూడా మన సినిమాలు అందులో ఉన్న కంటెంట్ లు మన ఇండస్ట్రీని టాప్ లో నిలబెట్టాయి.అయితే 2022 ఏడాదిలో మన టాలీవుడ్ లో కొత్తగా పరిచయం అయిన దర్శకులు కూడా ఉన్నారు.
ఈ నూతన దర్శకులు బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ సినిమాలను అందించారు.మరి ఆ నూతన దర్శకులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
వీరి కెరీర్ స్టార్ట్ చేసిన మొదటి సినిమాలతోనే హిట్ అందుకున్నారు ఈ నూతన డైరెక్టర్లు.వీరు నిర్మాతలు నమ్మి పెట్టిన పెట్టుబడులను రాబట్టేలా చేయడమే కాకుండా లాభాలు ఆర్జించేలా కూడా చేసారు.
మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న డైరెక్టర్ లలో సినిమాటోగ్రాఫర్ విద్యాసాగర్ కూడా ఉన్నారు.ఈయన అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాకు దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో ఇతని మేకింగ్ ఎంతో ఆకట్టుకుంది.

డీజే టిల్లు సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు విమల్ కృష్ణ. ఈ సినిమాలో ఇతడి ప్రెజెంటేషన్ అందరిని ఆకట్టుకుంది.అలాగే బింబిసారా సినిమాతో డైరెక్టర్ వసిష్ఠ బాక్సాఫీస్ లెక్కలను తారుమారు చేసాడు.
ఒక కొత్త డైరెక్టర్ మొదటి సినిమాతోనే ఇలాంటి సినిమా తీయవచ్చు అని నిరూపించాడు.

ఇక ఒకే ఒక జీవితం సినిమా ఎలాంటి హడావిడి లేకుండా వచ్చి హిట్ అందుకున్న డైరెక్టర్ శ్రీ కార్తీక్. ఈయన టైం ట్రావెల్ సినిమాను అద్భుతంగా చూపించి ఆడియెన్స్ ను మెప్పించాడు.ఇక ఈ ఏడాది బెస్ట్ హారర్ మూవీగా మసూద నిలిచినా విషయం తెలిసిందే.
ఈ హారర్ జోనర్ సినిమాను కొత్త డైరెక్టర్ సాయి కిరణ్ తెరకెక్కించాడు.ఈ నూతన డైరెక్టర్లు అంతా కూడా తమ నిర్మాతలకు లాభాలు కలిగేలా చేసారు.







