మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా లో చిరంజీవి తో పాటు కీలక పాత్ర లో మాస్ మహారాజా రవితేజ నటించిన విషయం తెల్సిందే.
సాధారణం గా రవితేజ ఈ సినిమా లో నటించాడు అంటేనే అంచనాలు తార స్థాయికి చేరుతున్నాయి.చిరంజీవి సినిమా లో ఒకప్పుడు రవితేజ నటించాడు.
అప్పుడు రవితేజ ఒక సింపుల్ నటుడు.కానీ ఇప్పుడు రవితేజ స్టార్ హీరో, అలాంటి స్టార్ హీరో మరో స్టార్ హీరో అయిన చిరంజీవి సినిమా లో నటించాడు అంటే మామూలు విషయం కాదు.
ఏకంగా ముప్పావు గంట కు పైగా స్క్రీన్ టైం రవితేజకు ఉన్నట్లుగా తెలుస్తోంది.ఇక తాజాగా రవితేజ నటించిన ధమాకా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సొంతం చేసుకుంది.

దాదాపుగా రూ.100 కోట్ల కలెక్షన్స్ నమోదు చేసే దిశగా ధమాకా సినిమా దూసుకు పోతుంది.దాంతో వాల్తేరు వీరయ్య సినిమా కు ధమాకా సక్సెస్ ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.ధమాకా సినిమా సక్సెస్ అవ్వడం తో రవితేజ యొక్క క్రేజ్ మరింతగా పెరిగినట్లు అయింది.
అందుకే వాల్తేరు వీరయ్య సినిమా యొక్క మార్కెట్ మరియు ఓపెనింగ్స్ కచ్చితంగా పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.బాక్సాఫీస్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే సంక్రాంతి సినిమాల రేసులో వాల్తేరు వీరయ్య పై చేయి సాధించింది.
విడుదలైన తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంటే కచ్చితంగా కలెక్షన్స్ ఓ రేంజ్ లో ఉండే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.







