ఏపీ అధికార పార్టీ వైసీపీలో దిక్కర స్వరాలు పెరుగుతున్నాయి.ఒక్కో నేత తన అసంతృప్తి వెళ్ళగక్కుతూ బహిరంగంగా ప్రభుత్వం పైన విమర్శలు చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
మొన్నటి వరకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసిపి ఎమ్మెల్యేగా ఉన్నా, తమ పనులేవి కావడం లేదంటూ బహిరంగంగానే అసంతృప్తిని వెళ్లగక్కారు.కొద్దిరోజులుగా సీనియర్ రాజకీయ నాయకుడు వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ చోటు చేసుకుంటున్న సంఘటనలపై తన అసంతృప్తిని బహిరంగంగా వెళ్ళగక్కుతూ సంచలనంగా మారారు.
తాజాగా తిరుపతి జిల్లా డక్కిలిలో కన్వీనర్లు, విజయసారధులతో జరిగిన కార్యక్రమంలో ఆనం సంచలన వ్యాఖ్యలు చేశారు.తాను అందరిలాంటి ఎమ్మెల్యేను కాదని , రోజు ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటాను అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల కొన్ని పత్రికల్లో మనవాళ్లే రాబోయే రోజుల్లో ఇక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేస్తారని చెబుతున్నారు.ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నానా లేదా అనే విషయంలో నాకే అనుమానం కలుగుతుంది.
మీరు ఎమ్మెల్యేనా ? రానున్న రోజుల్లో ఇంకో ఎమ్మెల్యే వస్తారా అని కార్యకర్తలు నన్నే అడుగుతున్నారు.నేను ఉన్నానని మరొకరి చెబితే నిజమేనేమో అనుకోవాల్సి వస్తోంది.
ఈ ఏడాది అంతా రోడ్డుమీద, కాలువ మీద పడి గడపగడపకు తిరిగి నేను చేయాల్సిన పని ఏదో నాకు కూడా తెలియట్లేదు.ఈ విషయాలనే పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లాను అంటూ ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.
ఇక కన్వీనర్లు, విజయ సారధులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇది పిల్లలు ఆడుకునే కుర్చీలాట కాదు మీకు జగనన్న ముద్ర ఉంది నాకు రాజముద్ర ఉంది అంటూ మాట్లాడారు.

ఈ మధ్యలో వచ్చిన కొందరు వీడు ఎప్పుడు ఖాళీ చేస్తాడా కూర్చి లాక్కుందామని చూస్తున్నారు.కొందరు మ్యూజికల్ చైర్ ఆడుతుంటారు.మాకు ఏడాది తర్వాత వచ్చే ఎన్నికకు ఇప్పుడే ఎసరు పెడుతున్నారు.
సరే ఇక్కడ ఉంటానో ఇంకొక దగ్గరికి పోతానా.ఇంటికే పోతానో అవన్నీ తర్వాత విషయాలు ఇలాంటి వ్యవస్థల మధ్య పనిచేస్తున్న అన్ని సమస్యలు ఉన్న మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నానంటే ఇది ఈ ప్రాంతం పట్ల ప్రజాప్రతినిధిగా నా బాధ్యత, చిత్తశుద్ధి.
ఎంతమంది ఎన్ని మాట్లాడుకున్నా ఎవరు కుర్చీలు కావాలని ఆశించిన నాకైతే అభ్యంతరం లేదు.దొరికిన కుర్చీల్లో కూర్చోండి.
నేను ఉన్నంతవరకు నా కుర్చీ మాత్రం నాదే అంటూ ఆనం రామ నారాయణ రెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
.






