గత రెండు మూడు రోజులుగా ఎక్కడ చూసినా స్టార్ హీరోల భార్యలు ఏకంగా హీరోయిన్స్ కి ఏమాత్రం తక్కువ కాదు అంటూ వార్తలు కనిపిస్తున్నాయి.కొన్ని ప్రధాన వెబ్ సైట్స్ దీన్ని పతాక శీర్షికగా రాస్తున్నారు.
హీరోయిన్ అవ్వాలంటే ఏం కావాలి చెప్పండి ? అందంగా ఉండాలి, మంచి ఫిగర్ మెయింటైన్ చేయాలి, చూడడానికి డ్రెస్సింగ్ సెన్స్ అద్భుతంగా ఉండాలి.ఇవి ఉంటే చాలు హీరోల భార్యలు హీరోయిన్స్ ని మించి కనిపిస్తారు వారి అభిమానులకు.
ఈమధ్య హీరోల భార్యలు ముఖ్యంగా అల్లు అర్జున్ భార్య స్నేహ మోడల్స్ ని మించి డ్రెస్సులు వేస్తూ ఫోటో షూట్స్ చేయించుకుంటూ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తుంది.అక్కడ మొదలైంది ఈ హీరోల భార్యలు హీరోయిన్స్ ని మించి ఉంటున్నారు అనే వార్త.
సరే హీరోల భార్యలు అందగత్తెలే.కానీ అంతకన్నా ముందు హీరోల కూతుర్లు ఏం అన్యాయం చేశారు.
అందం ఉండి, అంతకన్నా బోలెడు టాలెంట్ ఉండి, పుష్కలంగా అవకాశాలు ఉండి కూడా కొంతమంది తమ కూతుర్లను హీరోయిన్స్ చేయలేకపోయారు.అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి, కృష్ణ కుమార్తె ఘట్టమనేని మంజుల, నాగబాబు కూతురు నిహారిక.
వీరికి ఏం తక్కువ చెప్పండి ? హీరోయిన్స్ మెటీరియల్స్ కాదనా వారి అభిమానుల ఉద్దేశం.

ఖచ్చితంగా కాదు … ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ముగ్గురు నటీమణుల్లో మంచి నటనతో పాటు మంచి ఫిగర్ కూడా ఉంది.అయినా కూడా అభిమానులకు తమ హీరోల కూతుర్లు హీరోయిన్స్ అవడం ఇష్టం లేదు.కానీ హీరోల భార్యలు మాత్రం హీరోయిన్స్ నుంచి అందంగా ఉండాలని కోరుకుంటారు.
ఇదెక్కడి న్యాయం.కాస్త ఆలోచించి కామెంట్స్ చేస్తే బాగుంటుంది.
అందరికి కూడా నటించాలనే కోరిక ఉంటే ఎవరు ఆపగలరు కానీ వీరి కామెంట్స్ తట్టుకోలేక ఇండస్ట్రీకి రాకుండా ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు.వచ్చిన త్వరగా నే వెనక్కి వెళ్ళిపోతున్నారు.
ఇకనైనా అభిమానులు మేలుకుంటే మంచిది.







