తెలుగు భాషలో అత్యంత హీనపదం ' హీరోయిన్ సరుకు ' .. ఇది ఎలా పుట్టింది ?

తెలుగు భాషలోనే అత్యంత హీనమైన పదం సరుకు. అదేంటి ఈ పదం ఎలా హీనమైనది అని అనుకుంటున్నారా ? దానికి ముందు హీరోయిన్ జోడిస్తే అది హీనమైన పదమే.పలానా నటి ఒక హీరోయిన్ సరుకు అని చెప్పడం ఎంతవరకు సమంజసం.అసలు ఈ హీరోయిన్ సరుకు అంటే ఏమిటి? ఒక నటిని సరుకుతో పోల్చడం పట్ల అర్థం ఏమై ఉంటుంది.గతంలో హీరోయిన్ అంటే మంచి నటి, అలాగే మంచి అంగ సౌష్టవం కలిగిన వ్యక్తి, భాషను స్పష్టంగా పలకగలిగేది.వాటితో పాటు ఒంపు, సొంపు, వయ్యారం వంటి వాటిల్లో కాస్త అవగాహన కలిగి ఉన్న వ్యక్తి అయ్యి ఉండాలి.

 How This Worst Term Made For Heroines Details, Heroines, Worst Term, Heroines It-TeluguStop.com

ఇలాంటి అన్ని సుగుణాలు కలిగి ఉన్న నటిని హీరోయిన్ అని అంటూ ఉంటారు.కానీ దానికి పూర్తిగా అర్థం మారిపోయినా రోజులివి.హీరోయిన్ అంటే దర్శకుడు ఏం అడిగినా ఒప్పుకోవాలి, నిర్మాత ఏం చెప్పినా వినాలి.బాడీలో ఏమైనా డిఫెక్ట్ ఉన్నా కూడా గ్రాఫిక్స్ లో కవర్ చేస్తారు.

భాష పలకకపోతే ఏముంది డబ్బింగ్ తో మేనేజ్ చేస్తారు.నటించక పోయినా పరవాలేదు ఎలాగోలా నడిపించేస్తారు.

అందుకే హీరోయిన్ కాస్త హీరోయిన్ సరుకు అని మార్చేశారు నేటితరం మేకర్స్.అలా అంగడి సరుకు లాగా హీరోయిన్ అనే సరుకును వాడుతూ సినిమాలకు గ్లామర్ జోడించి మరి అమ్ముకుంటున్నారు.

అంతలా దిగజారిపోయింది నేటి సినిమా పరిస్థితి.

Telugu Directors, Heroes, Saruku Word, Glamor, Item, Producers, Romance, Tollywo

కేవలం ముద్దుల కోసం, హగ్గుల కోసం, పాటలో అరకొర వస్త్రాలతో గెంతులెయ్యడం కోసం మాత్రమే ఆ సరుకు పనికొస్తుంది.కథలో లీనమయ్యే పాత్రలు ఇప్పట్లో లేవు.ఒకవేళ ఉన్నా కూడా హీరోయిన్ సెంట్రింక్ గా హీరో అనే వాడే లేకుండా చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

హీరో, హీరోయిన్ కి అనుగుణంగా ఒక అద్భుతమైన కథ నడవడం అనేది ఇప్పటి రోజుల్లో దాదాపు అసాధ్యమే.సినిమాతో పాటు హీరోయిన్ కూడా అంగడి సరిపోయింది.ఇకనైనా సినిమాల పరిస్థితి మారితే తప్ప రానున్న రోజులు మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కోవచ్చు.కేవలం నాలుగు పాటలకు గెంతులు వేసి రెండు లేదా మూడు కోట్లు తీసుకొని వెళ్ళిపోయే హీరోయిన్స్ మాత్రమే వస్తారు.

పది కాలాల పాటు గుర్తుపెట్టుకునే నటీమణులు ఇకపై రావడం దాదాపు అసాధ్యం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube