1.బిజెపిలోకి భారీగా చేరికలు : ఈటెల రాజేందర్
తెలంగాణలో బిజెపి మిషన్ ప్రారంభమైందని, త్వరలో భారీగా చేరికలు ఉంటాయని హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.
2.కరోనాపై హరీష్ రావు కామెంట్స్
మళ్లీ కరోనా వస్తే ఎదుర్కొనే శక్తి తెలంగాణకు ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు.
3.తెలంగాణలో పెరిగిన క్రైమ్ రేట్ : డీజీపీ
తెలంగాణలో క్రైమ్ రేట్ పెరిగిందని, గత ఏడాది తో పోలిస్తే 4.4% క్రైమ్ రేట్ పెరిగినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.
4.కందుకూరు ఘటన బాధిత కుటుంబాలకు బాబు పరామర్శ
నెల్లూరు జిల్లా కందుకూరు లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు.
5.కందుకూరు దుర్ఘటన బాధ కలిగించింది : వీర్రాజు
కందుకూరు సభలో జరిగిన దుర్ఘటన బాధ కలిగించిందని ఏపీ బిజేపి అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
6.హై కోర్ట్ ను ఆశ్రయించిన సునీల్ కనుగొలు
సైబర్ క్రైమ్ పోలీసులు ఇచ్చిన నోటీసుపై తెలంగాణా కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు హై కోర్ట్ ను ఆశ్రయించారు.
7.చంద్రబాబుపై రోజా కామెంట్స్
నిన్నటి కందుకూరు ఘటన బాధాకరమని పబ్లిసిటీ పిచ్చి కోసం టిడిపి అధినేత చంద్రబాబు ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్నరని వైసీపీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు.
8.కందుకూరు ఘటనపై ఏపీ గవర్నర్ దిగ్భ్రాంతి
నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మృతి చెందినట్టు ఏపీ గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
9.సిపిఐ నేతల అరెస్ట్
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని ఫెడరల్ వ్యవస్థను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించిన సిపిఐ నేతలను ఏపీ పోలీసు అరెస్టు చేశారు.
10.కెసిఆర్ పై విజయశాంతి కామెంట్స్
బీఆర్ఎస్ పార్టీ ఏపీలో, మిగతా రాష్ట్రాల్లోనూ ఏర్పాటు చేయాలని అనుకోవడం అనవసర ప్రయత్నం అవుతుందనేది అందరికన్నా కేసీఆర్ కే ఎక్కువ తెలుసునని బిజెపి నేత విజయశాంతి కామెంట్ చేశారు.
11.సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి పండుగ రద్దీని క్రమబద్ధీకరించేందుకు తాంబరం నుంచి తిరునల్వెలి, నాగర్ కోయిల్ , కొచ్చువేలి, చెన్నై, సెంట్రల్ నుంచి ఎర్నాకులంకు ప్రత్యేక రైల నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
12.కందుకూరి ఘటనపై పవన్ కళ్యాణ్ కామెంట్స్
నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు సభ జరుగుతుండగా జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మృతి చెందడం, మరి కొంతమంది ఆసుపత్రి పాలవడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.ఈ ఘటన దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.
13.కందుకూరు ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి
ఏపీలోని నెల్లూరు జిల్లా కందుకూరులో టిడిపి సభలో జరిగిన తొక్కిసలాట లో 8 మంది మృతి చెందడం పై తాను తీవ్రంగా కలత చెందానని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
14.బిజెపి హటావో సింగరేణి బచావో
బిజెపి హటావో సింగరేణి బచావో అని మనం పోరాటం చేయాలని తెలంగాణ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు.
15.కందుకూరు ఘటన మృతులకు ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియ
నెల్లూరు జిల్లా కందుకూరులో నిన్న టిడిపి అధినేత చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోలో జరిగిన తొక్కసలట లో ఎనిమిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.దీనికి ఏపీ ప్రభుత్వం స్పందించింది .ఒక్కొక్కరికి రెండు లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
16.కేఏ పాల్ కామెంట్స్
నెల్లూరు జిల్లాలోని కందుకూరులో నిన్న నిర్వహించిన చంద్రబాబు రోడ్ షోలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది టిడిపి కార్యకర్తలు మృతి చెందిన ఘటనపై ప్రజాశాంతి పార్టీ అధినేత స్పందించారు. గ్రౌండ్ లో పెట్టాల్సిన సభను రోడ్డు మీద పెట్టారని ఆయన చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
17.కోలుకుంటున్న ప్రధాని తల్లి
భారత ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హేరాబెన్ మోదీ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు.నిన్న అనారోగ్యంతో ఆమె ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.
18.టీఎస్పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్
తెలంగాణలోని వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.వ్యవసాయ, సహకార శాఖలో 148 అగ్రికల్చర్ ఆఫీసర్ల పోస్టులు, 128 ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులను టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్, కమిషనర్ నియంత్రణలో నేరుగా భర్తీ చేయడానికి నోటిఫికేషన్లను విడుదల చేశారు.
19.నటుడు నిర్మాత వల్లభనేని జనార్దన్ మృతి
ప్రముఖ నటుడు దర్శకుడు వల్లభనేని జనార్ధన్ అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
20.పోలవరం పర్యటనలో పిపిఏ బృందం
నేటి నుంచి రెండు రోజులు పాటు పోలవరం లో పిపిఏ బృందం పర్యటించనుంది.ప్రాజెక్టు పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.