స్టార్ హీరో ప్రభాస్ బలహీనత ఇదే.. ప్రభాస్ శ్రీను షాకింగ్ కామెంట్స్ వైరల్!

ఒక స్టార్ హీరోను నమ్మి వేర్వేరు నిర్మాతలు 3000 కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమాలను నిర్మించడం కేవలం ప్రభాస్ విషయంలోనే సాధ్యమవుతోంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకనిర్మాతలు ఉన్నా వాళ్లు ప్రభాస్ ను నమ్మిన స్థాయిలో ఇతర హీరోలను నమ్మడం లేదు.

 Star Hero Prabhas Biggest Minus Details Here Goes Viral ,prabhas,star Hero Prabh-TeluguStop.com

ప్రభాస్ సినిమాల బిజినెస్ పై ఆయన ఫ్లాప్ సినిమాలు ఏ మాత్రం ప్రభావం చూపడం లేదు.

పాజిటివ్ టాక్ వస్తే ప్రభాస్ ఏ రేంజ్ లో రికార్డులు సృష్టిస్తారో సలార్ సినిమాతో ప్రూవ్ అవుతుందని ప్రభాస్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి ప్రభాస్ కు అత్యంత సన్నిహితులలో ఒకరైన ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.నీళ్లు అంటే నాకు చాలా భయమని ప్రభాస్ శ్రీను అన్నారు.

నాకు ఈత వచ్చని అయినప్పటికీ నీళ్లు అంటే భయపడతానని ఆయన పేర్కొన్నారు.

నేను రోజూ డ్రింక్ చేస్తానని ప్రభాస్ శ్రీను కామెంట్లు చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ గారితో నాకు ఇప్పటికీ మంచి రిలేషన్ ఉందని ఆయన పేర్కొన్నారు.నేను పాంపరింగ్ చేయనని అలా చేయడం కూడా నాకు నచ్చదని ప్రభాస్ శ్రీను అన్నారు.

ప్రభాస్ గారికి మంచితనమే ప్లస్ అని ఆయన మంచితనమే బలహీనత అని ఆయన కామెంట్లు చేశారు.బ్రహ్మానందం గారు టాలెంట్ ఉన్నవాళ్లను ప్రోత్సహిస్తారని ప్రభాస్ శ్రీను పేర్కొన్నారు.

విక్రమార్కుడు సినిమాలో మంచి పాత్ర దక్కిందని ఆయన తెలిపారు.ఆ సినిమాలో రియల్ గా దెబ్బలు తిన్నానని ప్రభాస్ శ్రీను పేర్కొన్నారు.ఆర్టిస్ట్ అంటే ఏమైనా చేయాలని ఆయన వెల్లడించారు.సినిమాలలో ప్రతిదీ ప్రాసెస్ అని ప్రభాస్ శ్రీను పేర్కొన్నారు.ప్రభాస్ శ్రీను ప్రభాస్ గురించి పాజిటివ్ గా చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube