హైదరాబాద్ లోని శామీర్పేట్లో బీజేపీ పార్లమెంట్ విస్తారక్ల సమావేశం జరిగింది.ఈ సమావేశానికి 110 పార్లమెంట్ నియోజకవర్గాల విస్తారక్ లు హాజరైయ్యారు.
ఇందులో భాగంగా ఇవాళ, రేపు దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ విస్తారక్ లకు శిక్షణ ఇవ్వనున్నారు.ఉత్తరాదిలో బలహీనంగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాల్లోని విస్తారక్ లకూ కూడా శిక్షణ ఇవ్వనున్నారు.
అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై శిక్షణ ఇస్తారని సమాచారం.కాగా ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్ గా పాల్గొననున్నారు.
రేపటి సమావేశాల్లో బీఎల్ సంతోష్ పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.శిక్షణ శిబిరం ముగిశాక తెలంగాణ నేతలతో బీఎల్ సంతోష్ కీలక సమావేశం నిర్వహించనున్నారు.
ఇందులో అసెంబ్లీ నియోజకవర్గాలకు పాలక్ లను నియమించే అవకాశం ఉంది.







