పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ' ఆంధ్ర ఆక్టోపస్ ' ?

ఆంధ్ర ఆక్టోపస్ గా పేరు పొందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మళ్లీ పొలిటికల్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.2004,  2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీగా రెండుసార్లు విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి లగడపాటి విజయం సాధించారు.ఎన్నికల సర్వేలు చేయిస్తూ రాజకీయ జోస్యం చెప్పడంలో సిద్ధహస్తుడిగా లగడపాటి రాజగోపాల్ కు మంచి గుర్తింపు ఉండేది.ఆయన చెప్పినట్లుగానే ఎన్నికల ఫలితాలు వెలువడుతూ వస్తూ ఉండడంతో లగడపాటికి ఆ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి.2018 తర్వాత మాత్రం ఆయన చెప్పిన సర్వే ఫలితాలు రివర్స్ కావడంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.అప్పుడప్పుడు మాత్రమే మీడియా ముందుకు వస్తున్నారు.

 'andhra Octopus' Going To Give Political Re Entry ,lagadapati Rajagopal, Telanga-TeluguStop.com

ఏపీ, తెలంగాణ విభజన సమయంలో పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో లగడపాటి హల్చల్ చేయడం , పెప్పర్ స్ప్రే ఉపయోగించడం వంటివి రాజకీయంగా సంచలనంగా మారాయి.2014 ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ , తెలంగాణలో టిఆర్ఎస్ గెలుస్తుందని లగడపాటి జోస్యం చెప్పారు.అది నిజమైంది.అయితే 2018 తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందని లగడపాటి చెప్పగా,  అప్పుడు కూడా టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది.దీంతో లగడపాటి జోస్యం పై అనుమానాలు మొదలయ్యాయి.2019 ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తుందని లగడపాటి బలంగానే చెప్పారు.అయితే అప్పుడు కూడా లగడపాటి జోస్యం పనిచేయలేదు.

Telugu Ap, Congress, Jagan, Lanko Rajagopal, Tdp Chandrababu, Telangana, Ysrcp-P

వైసీపీ అఖండ మెజారిటీతో ఏపీలో అధికారంలోకి వచ్చింది.ఇక అప్పటి నుంచి లగడపాటి రాజకీయాలకు మరింత దూరం జరిగారు.అయితే ఇప్పుడు మళ్లీ పొలిటికల్ రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.2024.ఎన్నికల్లో విజయవాడ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అనుకూల పరిస్థితులపై సర్వేలు చేస్తున్నారట.

ప్రస్తుత విజయవాడ ఎంపీ కేసినేని నాని రాజకీయాలపై విరక్తితో ఉండడం,  ఆయన టిడిపిలో ఉన్నా,  అసంతృప్తితో ఉండడంతో రాబోయే ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలవాలనే ప్రయత్నాల్లో లగడపాటి ఉన్నట్లు సమాచారం.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube