రాజమౌళి వల్ల పవన్ కు జరిగిన మేలు ఇదే.. రికార్డు రేటు రావడంతో?

పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లోనే ఎక్కువ కాలం షూటింగ్ జరుపుకున్న సినిమాగా హరిహర వీరమల్లు నిలిచిందనే సంగతి తెలిసిందే.ఈ సినిమా షూట్ ఎప్పటికి పూర్తవుతుందో ఈ సినిమా థియేటర్లలో ఎప్పుడు విడుదలవుతుందో ఈ సినిమా మేకర్స్ సైతం ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది.

 Pawan Kalyan Benefited Because Of Rajamouli Details Here Goes Viral ,pawan Kalya-TeluguStop.com

సినిమా షూటింగ్ ఆలస్యం కావడం వల్ల ఈ సినిమా బడ్జెట్ కూడా అంచనాలకు మించి పెరుగుతోంది.

నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమా కథపై ఉన్న నమ్మకంతో ఈ సినిమా ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడటం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ మధ్య కాలంలో పరిమితంగా సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్న కీరవాణి ఈ సినిమాకు కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.అయితే కీరవాణి ఈ సినిమాకు సంగీత దర్శకునిగా వ్యవహరించడం ఈ సినిమాకు ఎంతగానో ప్లస్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఆర్.ఆర్.ఆర్.సినిమాకు కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ కాగా ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ లో మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.నాటు నాటు సాంగ్ కు సంబంధించి ఆస్కార్ కు నామినేషన్ దక్కడంతో కీరవాణి గురించి మళ్లీ చర్చ జరుగుతోంది.అయితే కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించడం వల్ల ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ కు విపరీతమైన డిమాండ్ నెలకొందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా కోసం పడిన కష్టం పవన్ కళ్యాణ్ సినిమాకు ప్లస్ అయిందని రాజమౌళి పరోక్షంగా పవన్ కళ్యాణ్ కు సహాయం చేశారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.ఏది ఏమైనా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు పవన్ ఆశలను ఏ స్థాయిలో నెరవేరుస్తుందో చూడాల్సి ఉంది.

రాజమౌళి సాయం లేకుండానే అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సంపాదించుకోగా పవన్ కళ్యాణ్ కూడా పాన్ ఇండియా హీరోగా సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube