రాజమౌళి వల్ల పవన్ కు జరిగిన మేలు ఇదే.. రికార్డు రేటు రావడంతో?

పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లోనే ఎక్కువ కాలం షూటింగ్ జరుపుకున్న సినిమాగా హరిహర వీరమల్లు నిలిచిందనే సంగతి తెలిసిందే.

ఈ సినిమా షూట్ ఎప్పటికి పూర్తవుతుందో ఈ సినిమా థియేటర్లలో ఎప్పుడు విడుదలవుతుందో ఈ సినిమా మేకర్స్ సైతం ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది.

సినిమా షూటింగ్ ఆలస్యం కావడం వల్ల ఈ సినిమా బడ్జెట్ కూడా అంచనాలకు మించి పెరుగుతోంది.

నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమా కథపై ఉన్న నమ్మకంతో ఈ సినిమా ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడటం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ మధ్య కాలంలో పరిమితంగా సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్న కీరవాణి ఈ సినిమాకు కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే కీరవాణి ఈ సినిమాకు సంగీత దర్శకునిగా వ్యవహరించడం ఈ సినిమాకు ఎంతగానో ప్లస్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

"""/"/ ఆర్.ఆర్.

ఆర్.సినిమాకు కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ కాగా ఆర్.

ఆర్.ఆర్ సక్సెస్ లో మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

నాటు నాటు సాంగ్ కు సంబంధించి ఆస్కార్ కు నామినేషన్ దక్కడంతో కీరవాణి గురించి మళ్లీ చర్చ జరుగుతోంది.

అయితే కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించడం వల్ల ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ కు విపరీతమైన డిమాండ్ నెలకొందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

"""/"/ రాజమౌళి ఆర్.ఆర్.

ఆర్ సినిమా కోసం పడిన కష్టం పవన్ కళ్యాణ్ సినిమాకు ప్లస్ అయిందని రాజమౌళి పరోక్షంగా పవన్ కళ్యాణ్ కు సహాయం చేశారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ఏది ఏమైనా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు పవన్ ఆశలను ఏ స్థాయిలో నెరవేరుస్తుందో చూడాల్సి ఉంది.

రాజమౌళి సాయం లేకుండానే అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సంపాదించుకోగా పవన్ కళ్యాణ్ కూడా పాన్ ఇండియా హీరోగా సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.

జాతర రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?