మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ట్రిపుల్ ఆర్ వంటి పాన్ ఇండియా సినిమా తర్వాత మరింత జోష్ పెంచేసాడు.రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చరణ్ నెక్స్ట్ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది.
ప్రెజెంట్ చరణ్ RC15 చేస్తున్నాడు.అగ్ర డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.దీని కంటే ముందే గత కొన్ని రోజుల క్రితమే చరణ్ జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో RC16 సినిమాను ప్రకటించాడు.కానీ ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది.
అయితే వెంటనే నెక్స్ట్ సినిమాను బుచ్చిబాబు సానాతో చేయబోతున్నట్టు అఫిషియల్ గా ప్రకటించారు.
దీంతో వీరి కాంబో లోనే RC16 సినిమా వస్తుంది అని ఫిక్స్ అయ్యింది.
ఇక దీని తర్వాత కూడా చరణ్ లైనప్ పై ఏదొక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది.ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండానే మరో సినిమా లైన్లో పెట్టినట్టు టాక్.
రామ్ చరణ్ తో యూవీ క్రియేషన్స్ గత కొన్ని రోజులుగా సినిమా చేయాలని చర్చలు జరుపు తున్నారు.
అయితే చర్చల అనంతరం ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్టు తెలుస్తుంది.ఈ సినిమాను కన్నడ డైరెక్టర్ తెరకెక్కించ బోతున్నట్టు టాక్.కన్నడలో మఫ్టీ అనే సినిమాను తీసిన నర్తన్ ఇప్పుడు చరణ్ ను అద్భుతమైన లైన్ చెప్పి ఒప్పించినట్టు టాక్.
ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించ బోతున్నారట.మరి ఈ సినిమా కథ ఏంటి? ఏ జోనర్ లో ఉండబోతుంది లాంటి విషయాలు అయితే తెలియాల్సి ఉంది.ఏది ఏమైనా చరణ్ మాత్రం మంచి స్పీడ్ మీద ఉన్నాడు.