సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు పిల్లల పెంపకం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.సెలబ్రిటీలు పిల్లలను బాగా పెంచితే ఏ స్థాయిలో మంచి పేరు వస్తుందో పిల్లల పెంపకం విషయంలో పొరపాట్లు చేస్తే అదే స్థాయిలో చెడ్డ పేరు వస్తుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో అజయ్ దేవగణ్ కూతురును దారుణంగా ట్రోల్స్ చేస్తుండగా ఆ కామెంట్లు హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.
అజయ్ దేవగణ్ కూతురు నైసా దేవగణ్ కు ప్రేక్షకుల్లో కూడా గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.
నైసా దేవగణ్ తన స్నేహితుడైన ఓర్హాన్ అవత్రమణితో కలిసి ముంబైలో జరిగిన ఒక పార్టీకి హాజరయ్యారు.నైసా దేవగణ్ పార్టీకి హాజరవడంలో ఎలాంటి తప్పు లేకపోయినా నైసా, ఓర్హాన్ ఒకరి చేతులు మరొకరు పట్టుకుని తప్ప తాగి కనిపించడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
సినిమాలలో నీతులు చెప్పే అజయ్ దేవగణ్ నిజ జీవితంలో పిల్లల్ని సరైన విధంగా పెంచడంలో ఫెయిల్ అయ్యారని కొంతమంది చేస్తున్న కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తల్లీదండ్రులు కష్టపడి డబ్బులు సంపాదిస్తుంటే పిల్లలు మాత్రం జల్సాల కోసం డబ్బును వృథాగా ఖర్చు చేస్తున్నారని కొంతమంది నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

కాజోల్ పిల్లల పెంపకంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.వైరల్ అవుతున్న వీడియో గురించి నెటిజన్లు దారుణంగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.







