'వీరయ్య'తో కలిసి మాస్ రాజా ప్రమోషన్స్.. రేపు ప్రత్యేక ఇంటర్వ్యూ!

మెగాస్టార్ చిరంజీవి ప్రెజెంట్ నటిస్తున్న ప్రాజెక్టుల్లో వాల్తేరు వీరయ్య ఒకటి.ఇది మల్టీ స్టారర్ అనే విషయం తెలిసిందే.

 Ravi Teja Chiranjeevi To Come Together On Waltair Veerayya Promotions, Waltair V-TeluguStop.com

మెగాస్టార్ చిరు తో పాటు మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.ఈయనది చిన్న పాత్ర అని అనుకున్నారు.

కానీ రవితేజ ఈ సినిమాలో చాలా సేపు కనిపిస్తాడు అని తెలుస్తుంది.దీంతో ఇది మల్టీ స్టారర్ అనే చెప్పాలి.

డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.చాలా రోజుల తర్వాత చిరు, రవితేజ కాంబోలో సినిమా రాబోతుండడంతో సంక్రాంతికి మెగా ఫ్యాన్స్ తో పాటు మాస్ రాజా ఫ్యాన్స్ కు కూడా పూనకాలు లోడింగ్ అని తెలుస్తుంది.

ఇప్పటికే వచ్చిన సాంగ్స్, టీజర్స్, పోస్టర్స్ బాగా అలరిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో బాబీ మెగాస్టార్ వింటేజ్ లుక్ ను చూపించ బోతున్నాడు.

రాజా కూడా విక్రమ్ సాగర్ ఐపీఎస్ అనే పవర్ ఫుల్ రోల్ లో కనిపించ బోతున్నాడు.దీంతో ఈ ఇద్దరినీ బాబీ ఎలా తెరపై చూపించాడు అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.దీంతో రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయనున్నారు.ఈ క్రమంలోనే మెగాస్టార్ తో పాటు మాస్ రాజా కూడా ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగం కానున్నారు అని తెలుస్తుంది.రేపు సాయంత్రం మెగాస్టార్ చిరు, రవితేజ ఇద్దరు కలిసి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి తమ అనుభవాలను పంచుకునేందుకు మీడియా ముందుకు రానున్నట్టు తాజాగా ఒక బజ్ వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube