రావి కొండల రావు. ఈ పేరు కొత్త తరం యువతకు పెద్దగా పరిచయం ఉండదు.
కానీ ఒక జర్నలిస్ట్ గా, రైటర్స్ గా, థియేటర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వందల సినిమాల్లో నటించిన నటుడిగా నిన్నటి తరం వరకు బాగా పరిచయమే.ఇప్పటికి ఈనాడు కి చెందిన కొన్ని ఎడిటోరియల్ కాలమ్స్ లో అయన పేరు చూడవచ్చు.
బాపు తీసిన పెళ్లి పుస్తకం సినిమాకు గాను ఆయనకు బెస్ట్ రచయిత గా నంది అవార్డు వరించింది.ఇక బ్లాక్ అండ్ వైట్ అనే సినిమాకు కూడా నంది అవార్డు అనుకున్నారు.1958 లో శోభ అనే సినిమాతో నటుడిగా కూడా మారాడు.ఇంగ్లీష్ మరియు తెలుగు లో అనేక తెలుగు దినపత్రికలు కాలమిస్ట్ గా పని చేసారు.
అలాగే విజయ చిత్ర మ్యాగజిన్ కి అసోసియేట్ ఎడిటర్ గా, చందమామ ప్రొడక్షన్ హౌస్ కి ఇక్క్యూటివ్ గా ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నారు.ఇక రావి కొండల రావు భార్య రాధా కుమారి కూడా నటి.ఆమె ఎన్నో వందల సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేసారు.కొండల రావు మరియు రాధా కుమారి ఇద్దరు కలిసి కూడా వందకు పైగా చిత్రాల్లో కనిపించారు.
ఆ మధ్య కాలంలో శ్రేయోభిలాషి అనే చిత్రం లో దంపతులుగా నటించారు.ఈ చిత్రంలో నటించినందుకు గాను రాధా కుమారి కు నంది అవార్డు దక్కింది.జీవితం అంత కలిసి నడిచిన ఈ జంట చివరి క్షణంలో మాత్రం ఒకరితో ఒకరు లేకపోవడం నిజంగా బాధాకరం.రాధా కుమారి 2012 లో కన్ను మూయడం కొండల రావు గారు 2020 లో కాలం చేసారు.

ఒక రోజు ఎదో పని మీద వేరే ప్రాంతం వెళ్లాల్సి వచ్చింది కొండల రావు కి సరిగ్గా తెల్లవారు జామున మూడు గంటలకు విమానం.అయన విమానం లో అడుగు పెట్టిన ఆ క్షణమే రాధా కుమారి గుండె పోటు తో కన్ను మూసారు.మరునాడు తొమ్మిది గంటల వరకు ఆ విషయం రావి కొండల రావు కి తెలియలేదు.అది జీవితం లో పెద్ద లోటు గా అయన భావిస్తారు.చివరి క్షణాల్లో ఆమె పక్కన లేకపోయానే అనే బాధ ఆయన్ను చివరి వరకు కలచి వేసింది.ఇక ఈ జంటలు ఒక కుమారుడు కూడా ఉన్నారు.
రావి కొండల రావు 2020 లో 88 ఏళ్ళ వయసులో వయసు రీత్యా అనారోగ్యం పాలయ్యి కన్ను మూసారు.







