ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి చెందిన వ్యక్తులు చాలా దేశాలలో అత్యున్నత పదవులను పొందుతున్నారు.ఈ మధ్య కాలంలో ఐర్లాండ్ ప్రధానిగా భారత సంతతికి చెందిన వ్యక్తి ఎన్నికవ్వడం జరిగింది.
తాజాగా భారత సంతతికి చెందిన మైకీ హోధీ అమెరికా లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.క్యాలిఫోర్నియా రాష్ట్రం లోని లోడీ నగర మేయర్ గా ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక అవడం విశేషం.
ఈ నగరానికి తొలి సిక్కు మేయర్ గా ఈయన ఎన్నికవ్వడం జరిగింది.క్యాలిఫోర్నియా రాష్ట్రంలో ఒక నగరం మేయర్ పీఠాన్ని మన దేశ సంతతి సిక్కు వ్యక్తి దక్కించుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
మైకీ తల్లిదండ్రులు పంజాబ్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన వారే.ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన దేశస్థులు ఎక్కడ ఉన్నా మంచి మంచి పనులు చేస్తూ మన దేశానికి ఎంతో మంచి పేరు తీసుకురావాలని మనమందరం కోరుకుందాం.
ఇంకా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద పెద్ద పదవులలో ఉన్న వారు అవినీతి ఆరోపణలను ఎదుర్కొని కొన్ని రకాల కేసులలో జైలు శిక్షలను కూడా అనుభవిస్తున్నారు.అలాంటి అవినీతి ఆరోపణలు, మనీ లాండరింగ్ కేసుల్లో మల్దీవుల మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ 11 సంవత్సరాల జైలు శిక్షణ విధిస్తున్నట్లు ఆదివారం మల్దీవుల క్రిమినల్ కోర్ట్ తీర్పునిచ్చింది.జైలు శిక్షతోపాటు ఐదు మిలియన్ డాలర్ల జరిమానా కూడా విధించింది.అవినీతి కేసుల్లో నాలుగేళ్ల జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.2018 లో ప్రస్తుత మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలి పై పోటీ చేసి యామిన్ ఓడిపోయారు.