ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం తో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.నందమూరి బాలకృష్ణ యాంకర్ గా వ్యవహరిస్తున్న ఆ కార్యక్రమం లో ఇప్పటికే ప్రభాస్ హాజరయ్యాడు.
షూటింగ్ కూడా పూర్తి అయ్యింది.అందుకు సంబంధించిన ఎపిసోడ్ ఈ వారం లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది.
అతి త్వరలోనే ప్రభాస్ ఎపిసోడ్ రాబోతుందని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.మరో వైపు పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ మరియు క్రిష్ లో ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారని ఆహా టీం అధికారికంగా ప్రకటించింది.
పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ రెండు ఎపిసోడ్స్ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతాయా అంటూ మీడియా వారు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సమయం లో ఆహా వారు సారీ అంటూ చేసిన ఒక ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

ఇదేంటి సారీ చెప్తున్నారు… కొంపదీసి ప్రభాస్ ఎపిసోడ్ క్యాన్సల్ అయిందా లేదంటే వాయిదా పడిందా అంటూ ప్రభాస్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఆయన రావడం లేదా ఏంటి అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఆహా వారు సారీ అంటూ షేర్ చేసిన పోస్ట్ అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది.నందమూరి బాలకృష్ణ మరో వైపు వీర సింహారెడ్డి సినిమా తో బిజీ గా ఉన్నాడు.ఆ సినిమా చిత్రీకరణ ముగింపు దశలో ఉంది.సంక్రాంతి కానుకగా ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బాలకృష్ణ బిజీగా ఉన్నాడు.
కనుక పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ చిత్రీకరణ చేయడం లేదా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి ఆహా వారు చెప్పిన సారీ కి కారణమేమై ఉంటుంది అనేది క్లారిటీ రావాల్సి ఉంది.







