మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.ఏడాది ఆగస్టు నెలలో ఈమె కార్తికేయ 2సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది.ఈ సినిమా అనంతరం నిఖిల్ అనుపమ ఇద్దరూ మరోసారి 18 పేజెస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా కూడా మొదటి రోజు బ్రేక్ ఈవెంట్ సాధించి మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది.ఇలా రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అనుపమ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక డిసెంబర్ 29వ తేదీ ఈమె మరొక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఘంటా సతీష్ బాబు దర్శకత్వంలో జెన్ నెక్ట్ మూవీస్ పతాకంపై నిర్మించిన చిత్రం బటర్ ఫ్లై.
ఈ సినిమా 29వ తేదీ థియేటర్లో కాకుండా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కానుంది.అనుపమ నటించిన మొదటి సినిమా ఇలా మొదటిసారి ఓటీటీలో ప్రసారం కానుంది.
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా అనుపమ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.గత ఏడాది డిసెంబర్ నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించామని అయితే నెల రోజుల వ్యవధిలోనే షూటింగ్ పూర్తి అయినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం చాలా సమయం కేటాయించారని తెలిపారు.ఈ సినిమాలో తాను గీత అనే పాత్రలో నటించానని తన పాత్ర చాలా ఎమోషనల్ గా అందరిని ఆకట్టుకుంటుందని అనుపమ తెలిపారు.
ఇక ఈ ఏడాది తనకు చాలా బాగా కలిసి వచ్చిందని కార్తికేయ 2,18 పేజెస్ వంటి సినిమాలు మంచి హిట్ అయ్యాయని, ఈ రెండు సినిమాలను ఆదరించిన విధంగానే బటర్ ఫ్లై సినిమాని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనుపమ తెలియజేశారు.







