విమానం రెక్కల్లో ఇంధన ట్యాంక్ ఎందుకు ఉంటుందో తెలిస్తే...

విమానంలో ఇంధన వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది.అటువంటి పరిస్థితిలో దానిని నడిపేందుకు చాలా ఇంధనాన్ని నిల్వ చేయాలి.

 Why Do Aircraft Store Fuel In The Wings,aircraft,airplane Wings,fuel Tank,aeropl-TeluguStop.com

అలాగే విమానపు బరువుతో పాటు లిఫ్ట్ ఫోర్స్ కూడా సమతుల్యంగా ఉండాలి.విమానం ఇంధన ట్యాంక్ దాని రెక్క దగ్గర అమరి ఉంటుంది.

ఇలా ఎందుకు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.మనలో చాలా మంది విమానంలో ప్రయాణించే ఉంటారు.

విమానాలు పరిమాణంలో చాలా పెద్దవి.వాటి ఇంజన్ కూడా చాలా పెద్దదే.

ఇంత శక్తివంతమైన విమానం ఎగరడానికి మరింత ఇంధనం అవసరమని స్పష్టంగా తెలుస్తోంది.అయితే, ఇది విమానం ఇంజిన్ ఎంత పెద్దది? శక్తివంతమైనది అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది.

Telugu Aeroplanefuel, Aircraft, Airplane, Fuel Tank-General-Telugu

విమానంలో ఉపయోగించే ఇంధనం గురించి మాట్లాడినట్లయితే, ఒక అంచనా ప్రకారం, బోయింగ్ 747 రకం విమానం ప్రతి సెకనుకు 4 లీటర్ల ఇంధనాన్ని వినియోగిస్తుంది.దీని ప్రకారం, ఒక నిమిషంలో సుమారు 240 లీటర్ల ఇంధనం వినియోగించాల్సివస్తుంది.విమానంలో ఎక్కువ ఇంధన వినియోగం ఉన్నప్పుడు, అది ఎక్కడ నిల్వ చేయబడుతుందనే అనే ప్రశ్న మన మదిలో తలెత్తుతుంది.విమానంలోని ఇంధనం దాని మెయిన్ బాడీలో కాకుండా దాని రెక్కల్లో నిల్వ ఉంటుందని తెలిస్తే ఎవరైనాసరే ఆశ్చర్యపోతారు.

అవును మీరు చదివినది నిజమే.విమానంలోని భారీ ఇంధనం దాని రెండు రెక్కలలో నిండి ఉంటుంది.

Telugu Aeroplanefuel, Aircraft, Airplane, Fuel Tank-General-Telugu

అయితే ఇలా ఎందుకు ఉంటుంది? దాని రెక్కల్లో మాత్రమే ఇంధనం ఎందుకు నింపుతుంటారు? దీని వెనుక ఉన్న సైన్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.విమానంలోని ఇంధనాన్ని దాని రెక్కలలో నిల్వ చేయడానికి ప్రధాన కారణం దాని సమతుల్యతను కాపాడుకోవడం.వాస్తవానికి విమానం గాలిలో ఎగరాలంటే, దాని బరువు, లిఫ్ట్ ఫోర్స్‌లో సమతుల్యతను కలిగి ఉండటం చాలా ముఖ్యం.దాని రెక్కలపై విమానం బరువుకు సమానమైన లిఫ్ట్ ఫోర్స్ ఉండటం చాలా అవసరం.

అందుకే దాని రెక్కల్లో ఇంధనం ఉంటుంది.విమానం రెక్కలు చూడటానికి చాలా పెద్దవిగా ఉన్నప్పటికీ, వాటి లోపల పూర్తిగా బోలుగా ఉంటుంది.

ఈ రెక్కలలో జెట్ ఇంధనాన్ని నింపుతారు.విమానంలో రెక్కలు కాకుండా వేరే చోట ఇంధనం నిల్వ ఉంచితే విమానం బరువు పెరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube