ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసిన శ్రిలీల పేరు బాగా వినిపిస్తుంది.పెళ్లి సందడి సినిమాతో తన కెరియర్ ను స్టార్ట్ పెట్టిన ఈ అమ్మడు మరో సాయి పల్లవి అనే పేరును సంపాదించుకుంటుంది.
తొలి సినిమాతోనే తనలోని ప్రతిభను చాటుకుని ధమాకా చిత్తం తో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.స్టార్ హీరో అయినప్పటికీ అయినప్పటికీ రవితేజను డామినేట్ చేస్తూ ఆమె చేసిన డ్యాన్సులు ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచాయి చిత్రం విడుదలైన రోజు నుంచి ప్రతి ఒక్కరూ శ్రీలీల గురించే మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో గ్లామర్ డాల్స్ కి పెట్టింది పేరుగా మారిన టాలీవుడ్ కి శ్రిలీలా లాంటి అద్భుతమైన నటి దొరకడం మంచి పరిణామమే.
స్వతహాగా ఎంబిబిఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీ లీల అటు చదువులతో పాటు ఇటు నటనని కూడా చక్కగా బ్యాలెన్స్ చేస్తోంది.మొదట పెళ్లి సందడిలో నటించిన అది పర్వాలేదు అనిపించుకుంది.
కానీ ఆమెలో ఉన్న నటిని, డ్యాన్సర్ ని గుర్తించిన టాలీవుడ్ త్వరగానే పెద్ద హీరోల సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది.ఈ క్రమంలో అమే రెండో సినిమాగా గత వారం ధమాకా సినిమాలో హీరో రవి తేజ సరసన నటించింది.
ఈ చిత్రం విడుదల అయిన మొదటి రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.

ఈ చిత్రం తర్వాత అనగనగా ఒక రోజు, జూనియర్ వంటి రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.ఈ రెండు చిత్రాల్లో ఒకటి హిట్ అయిన కూడా అమే స్టార్ హీరోయిన్ ల లిస్ట్ లో చేరడం ఖాయం.కన్నడ ఇండస్ట్రీ ద్వారా తొలిసారి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీల టాలీవుడ్ లో మాత్రమే కాకుండా కన్నడ లో కూడా హీరోయిన్ గా బిజీ అవుతుంది.21 ఏళ్ల వయసులోనే శ్రీ లీల ఇంత రేంజ్ హీరోయిన్ గా మారడం మంచి పరిణామం అని చెప్పాలి.ఇక అమే ఇద్దరు స్పెషల్ కిడ్స్ నీ కూడా దత్తత తీసుకొని వారి కి అన్ని అవసరాలు చూసుకుంటుంది.
ఈ ఏజ్ లోనే ఇంత పెద్ద మనసు ఉండటం నిజంగా గ్రేట్ అని చెప్పాలి.







