బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు.బస్వాపుర్ భూ నిర్వాసితుల పట్ల వివక్ష ఎందుకని ప్రశ్నించారు.
మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ భూ నిర్వాసితులకు పరిహారం ఎంత ఇచ్చారని నిలదీశారు.మేం తెలంగాణ బిడ్డలం కాదా.? తగిన పరిహారం ఎందుకు ఇవ్వరని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇసుక లారీలతో జగదీశ్ రెడ్డి, గాదరి కిశోర్ కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు.రూ.650 కోట్లతో కొత్త సెక్రటేరియట్ కడుతున్నారన్నారు.ఈ నేపథ్యంలో బస్వాపుర్ నిర్వాసితులకు రూ.350 కోట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.







