కరోనా తరువాత నిత్యావసర ధరలు పెరిగిపోవడంతోపాటు ఆయిల్, గ్యాస్ ధరలు కూడా ఆకాశాన్నంటాయి.ఈ క్రమంలో సామాన్యుడు వాహనాన్ని బయటకి తీయాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.
దీన్నే అదనుగా చేసుకొని కొన్ని ఎలక్ట్రినిక్ వాహనాలు తయారు చేసే కార్పోరేట్ సంస్థలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చాయి.అందులో మొదట బాగా ప్రాచుర్యం పొందింది ఓలా.
ఓలా గురించి ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు.ఇక్కడ బ్రాండ్ వ్యాల్యూ చాలా ముఖ్యం.
అందుకే కార్పొరేట్ కంపెనీలు కోట్లు కుమ్మురించి బ్రాండ్ వ్యాల్యూని కాపాడుకునేందుకు యత్నిస్తాయి.
అగ్గిపుల్ల నుంచి సబ్బుబిళ్ళ వరకు మార్కెట్‌లో బ్రాండ్‌ను క్రియేట్ చేయడం అంటే సాధారణ విషయం కాదు.
ఈ నేపథ్యంలోనే ఓలా CEO భవిష్ అగర్వాల్ ఓలా ఈవీని మార్కెట్లోకి దూసుకెళ్లాలా ప్లాన్స్ వేసాడు.అందుకే ప్రీ బుకింగ్లోనే లక్షకు పైగా ఆర్డర్లు సాధించి ఓలా రికార్డులు సృష్టించింది.
స్కూటర్ డెలివరీ కోసం నెలల తరబడి కస్టమర్లు ఎదురు చూసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.కానీ కట్ చేస్తే గతేడాది డిసెంబర్లో విడుదలైన ఓలా వెహికల్స్ లో లోపాలు తెలెత్తడంతో కొనుగోలు దారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో ఓలా బ్రాండ్ వేల్యూ తగ్గింది.

దాంతో మరలా రంగంలోకి దిగిన భవిష్ అగర్వాల్ ప్రొడక్ట్ వ్యాల్యూలో కాస్త మార్పులు చేశారు.తయారీలో రాజీపడకుండా కొత్త కొత్త ఫీచర్లను నేడు పరిచయం చేస్తున్నారు.తాజాగా ఓలా స్కూటర్ ని క్రియేటీవ్ గా ఎలా వాడాలో తెలుపుతూ ఓ వీడియోని షేర్ చేశారు.
ఆ వీడియోలో ఓలా స్పీకర్లను ఉపయోగించి ఓ యువకుడు లైవ్ క్రికెట్ కామెంటరీ ఇవ్వడం నెటిజన్లను ఇపుడు విపరీంగా ఆకట్టుకుంటుంది.సదరు వీడియోను షేర్ చేసిన భవిష్.
మా వెహికల్ ని అత్యంత సృజనాత్మకంగా వినియోగించుకోవడం తొలిసారి చూస్తున్నానంటూ ట్వీట్ చేశారు.కాగా ఆ ట్వీట్ పై నెటిజన్లు రీట్వీట్ చేస్తున్నారు.







