ఎండ్ ఆఫ్ ట్రోల్స్.. పులివెందుల బస్టాండ్ నిర్మాణం వెనుక టీడీపీ పరోక్ష కృషి!

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ తన సొంత జిల్లా కడపలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు.ముఖ్యంగా తన సొంత నియోజకవర్గం పులివెందులలో విస్తృతంగా పర్యటించనున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కొత్త బస్‌ టెర్మినల్‌ను పులివెందులలో సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు.2020 డిసెంబర్‌లో కొత్త బస్‌ టెర్మినల్‌ నిర్మాణాన్ని సీఎం జగన్‌ ప్రకటించారు, త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కొన్ని అనివార్య కారణాల వల్ల బస్టాండ్‌ నిర్మాణం ఆలస్యమవడంతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సీఎం జగన్‌, వైసీపీ ప్రభుత్వాన్ని నిర్దాక్షిణ్యంగా ట్రోల్‌ చేసింది.దీన్ని సవాలుగా తీసుకున్న వైసీపీ బస్‌ టెర్మినల్‌ నిర్మాణాన్ని యుద్ద ప్రతి పాదకన పూర్తి చేసింది.

 Jagan Mohan Reddy Tour Ysr Kadapa District , Jagan Celebrate Christmas In Pulive-TeluguStop.com

  దీని కోసం పాత పులివెందుల బస్టాండ్‌ను ప్రయాణికులకు మూసి వేయడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అయితే ఇప్పుడు కొత్త బస్ టెర్మినల్ ప్రారంభోత్సవానికి సిద్ధమవ్వడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 34 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఇది ఆసియాలోనే అతిపెద్ద బస్ టెర్మినల్ అని ఈ వారం ప్రారంభంలో పనులను పరిశీలించిన APSRTC చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి తెలియజేశారు. నాలుగు ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ బస్ టెర్మినల్‌లో మల్టీప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు మరియు అనేక బస్ బేలు ఉన్నాయి.

  పులివెందుల కొత్త బస్ టెర్మినల్ యొక్క రెండు చిత్రాలు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి.
 

దీని సంబంధించిన పోటోలను వైసీపీ లీడర్‌లో సోషల్ మీడియా తెగ ప్రచారం చేస్తున్నారు.అయితే ఇది తమ ట్రోల్స్ వల్లే పూర్తి అయిందంటూ టీడీపీ సపోర్ట్‌టర్స్ కామెంట్స్ చేస్తున్నారు.  అయితే జగన్ ఇదే అబివృద్ది రాష్ట్రమంతా చేస్తే బాగుంటదని అభిప్రాయపడుతున్నారు.

జగన్ కనీసం తన నియోజకవర్గనైనా బాగు చేసుకుంటున్నాడని ప్రతి పక్షాలు అంటున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube