టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాల్లో బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.వచ్చే ఎన్నికలలో ఎలా అయినా గెలవాలి అనుకున్న పవన్ కళ్యాణ్ ఆ దిశగా అడుగులు వేస్తూ రాజకీయాలలో ఫుల్ యాక్టివ్ గా పాల్గొంటున్నారు.
అంతేకాకుండా సినిమాలకు వరుసగా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.పవర్ స్టార్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్న విషయం తెలిసిందే.
అయితే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ సినిమాల కంటే ఎక్కువగా రాజకీయాల పై ఎక్కువ శ్రద్ధను చూపిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే రాజకీయ ప్రచారాలు లేదంటే సినిమా ఇలా రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ దూసుకెళ్తున్నాడు.
ఇకపోతే పవన్ కళ్యాణ్ మూడవ భార్య అన్నా లెజీనోవా ప్రస్తుతం రష్యాలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.ప్రతి ఏడాది క్రిస్మస్ అక్కడే సెలబ్రేట్ చేసుకొని ఆ తర్వాత ఇండియాకు వస్తూ ఉంటుంది.
పవన్ కళ్యాణ్ కూడా ప్రతి ఏడాది తనతో భార్యతో పాటు క్రిస్మస్ వేడుకలలో భాగంగా రష్యాలో ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి.ఇది ఇలా ఉంటే ఈ ఏడాది కూడా పవన్ కళ్యాణ్ రష్యా కి వెళ్లబోతున్నాడా అంటే కష్టమే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే పవన్ కళ్యాణ్ కమిట్ అయిన హరిహర వీరమల్లు సినిమా క్లైమాక్స్ లో ఉంది.ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడుతూ వస్తోంది.ఈ సినిమా తర్వాత వినోదాయ సీతం సినిమా రెడీగా ఉంది.మరొకవైపు రాజకీయాలలో పాల్గొనడం కోసం వారాహి వాహనం కూడా రెడీగా ఉంది.ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమా ఇలాంటి బిజీ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ తన భార్య దగ్గరకు వెళ్తాడా అంటే లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.పండగ కేవలం రెండు రోజులే కాబట్టి వెళ్లి రావచ్చు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇంకొంతమంది పవన్ కళ్యాణ్ ఆల్రడీ బయలుదేరాడని రష్యాకు తొందరలోనే వెళ్ళడున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.







