పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.ఎమ్మెల్యే పిన్నెల్లి దాడులకు తెగబడ్డారని ఆరోపిస్తూ టీడీపీ ఛలో మాచర్లకు పిలుపునిచ్చింది.
ఇందులో భాగంగా మాచర్లకు వెళ్తున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.దీంతో దాచేపల్లి మాచర్ల క్రాస్ రోడ్డు వద్ద టీడీపీ నేతలు ధర్నాకు దిగారు.
రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్తిపాటి పుల్లారావు సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు.