కళ్ళ చుట్టూ చర్మం ఎంత నల్లగా ఉన్నా ఈ సింపుల్ చిట్కాతో తెల్లగా మార్చుకోండి!

సాధారణంగా కొందరికి కళ్ళ చుట్టూ చర్మం నల్లగా మారుతుంటుంది.దీన్నే డార్క్ సర్కిల్స్ లేదా నల్లటి వల‌యాలు అని అంటారు.

 Wonderful Home Remedy To Get Rid Of Dark Circles Naturally! Home Remedy, Dark Ci-TeluguStop.com

ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య చాలా అంటే చాలా ఎక్కువ‌గా కనిపిస్తుంటుంది.అందులోనూ ముప్పై ఏళ్లు పైబడిన వారిని డార్క్ సర్కిల్స్ అధికంగా వేధిస్తూ ఉంటాయి.

అలాగే ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, స్మార్ట్ ఫోన్‌ ల్యాప్‌టాప్ వంటి గాడ్జెట్స్ ను ఓవర్ గా వినియోగించడం వల్ల చిన్న వయసులో సైతం డార్క్ సర్కిల్స్ ఏర్పడుతుంటాయి.

కారణం ఏదైనప్పటికీ కళ్ళ చుట్టూ చర్మం నల్లగా మారడం వల్ల ముఖ సౌందర్యం దెబ్బ తింటుంది.

ఈ క్రమంలోనే డార్క్ సర్కిల్స్ ను వదిలించుకోవడం కోసం ముప్పతిప్పలు పడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను కనుక పాటిస్తే కళ్ళ చుట్టూ చర్మం ఎంత నల్లగా ఉన్నా సరే కేవలం కొద్ది రోజుల్లోనే తెల్లగా మారుతుంది.

మరి ఇంతకీ ఆ చిట్కా ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో అరకప్పు పీల్ తొలగించి కట్ చేసి పెట్టుకున్న బొప్పాయి పండు ముక్కలు, అరకప్పు కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, ప‌ది ఫ్రెష్ పుదీనా ఆకులు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, చిటికెడు ఆర్గానిక్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని ముప్పై నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి.ఆ పై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

రోజుకి ఒక్కసారి ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే కళ్ళ చుట్టూ ఏర్పడిన నల్లటి వలయాలు క్రమంగా దూరమవుతాయి.నల్లగా మారిన చర్మం మళ్లీ తెల్లగా, మృదువుగా మారుతుంది.

డార్క్ సర్కిల్స్ సమస్య నుంచి తొందరగా బయటపడాలని భావించే వారికి ఈ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.కాబట్టి తప్పకుండా ట్రై చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube