UP (ఉత్తర ప్రదేశ్)లోని గౌరధుందా గ్రామంలో నిర్మించిన కమ్యూనిటీ టాయిలెట్ ఇపుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమౌతోంది.సదరు టాయిలెట్ తాలూక ఫొటో చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.
అంతేకాకుండా ఈ ఫొటోను చూసిన వారు ‘ఈ ఐడియా ఎవడికొచ్చిందిరా బాబు?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.అవును, అక్కడ స్థానికంగా ఏర్పాటు చేసిన టాయిలెట్ పెద్ద దుమారాన్నే రేపింది.
విషయం ఏమంటే ఒకే టాయిలెట్ రూంలో రెండు టాయిలెట్ సీట్లు పక్కపక్కనే ఉండటం.
తనిఖీల్లో భాగంగా ఈ మరుగుదొడ్డిని పరిశీలించిన పంచాయతీ అధికారులు వాటిని చూసి బిత్తరబోయారు.
చూసింది నిజామా అబద్ధమా అని కాసేపు ఖిన్నులై చూస్తూ ఉండిపోయారు.కొంచెం తేరుకున్నాక విషయం తెలుసుకొని కోపంతో ఊగిపోతూ ఎవర్రా ఇలా చేసింది? అంటూ మండిపడ్డారు.ఇంత చెత్త ఆలోచన చేసిన స్థానిక సిబ్బందికి నోటీసులు జారీ చేశారు.ఉత్తరప్రదేశ్‌లోని టౌన్‌షిప్‌లో ప్రధాన కార్యాలయానికి 20 కిలోమీటర్ల దూరంలో వున్న గౌరధుందా గ్రామంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది.

ఇకపోతే ఆ గ్రామంలో కార్యదర్శి, ప్రధాన్‌లు రూ.10లక్షల వ్యయంతో కమ్యూనిటీ మరుగుదొడ్లను నిర్మించగా నేటికీ అక్కడ వాటిని ఎవరూ వాడకపోవడం కొసమెరుపు.అయితే మరుగుదొడ్లు నిర్మించినప్పటికీ వాటికి తలుపులు కూడా ఏర్పాటు చేయలేదని స్థానికులు చెప్పడం గమనార్హం.విషయం ఆ పెరుమాళ్ళకెరుకగాని అదే ప్లేసులో ఒకే మరుగుదొడ్డిలో ఈ రెండు టాయిలెట్ సీట్లను అమర్చారు.
కాగా ఈ విషయంపై జిల్లా పంచాయతీరాజ్ అధికారి నమ్రతా శరణ్ మాట్లాడుతూ.ఇలా చెత్త ఐడియాతో టాయిలెట్ నిర్మించిన అధికారులకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి నోటీసులు జారీ చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు.







