సమంత ఆరోగ్యం పై వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు... ఏమన్నారంటే?

ఆస్ట్రాలజర్ వేణు స్వామి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు.ఈయన ప్రముఖ జ్యోతిష్యుడుగా సినిమా సెలబ్రిటీలకు సంబంధించి వారి జాతకాలను తెలియజేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.

 Venu Swamy Sensational Comments Samanthas Health , Venu Swamy,astrologer Venu Sw-TeluguStop.com

ఇక ఈయన చెప్పిన విధంగానే కొందరి సెలబ్రిటీల జీవితంలో జరగడం వల్ల ఈయన తరచూ ఇంటర్వ్యూలకు హాజరవుతూ పలువురు సెలబ్రిటీల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వేణు స్వామి మరోసారి సమంత గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం సమంత మయోసైటిసిస్ అనే వ్యాధితో బాధపడుతూ సినిమాలకు దూరంగా ఉన్నారు.ప్రస్తుతం ఈ వ్యాధితో తలపడుతూ చికిత్స తీసుకుంటున్నటువంటి సమంత గురించి వేణు స్వామి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా సమంత ఆరోగ్యం గురించి వేణు స్వామి మాట్లాడుతూ తనకు 2025 వరకు ఎలాంటి ఇబ్బందులు లేవని 2025వ సంవత్సరం తర్వాత ఆమె జాతకంలో ఏలినాటి శని ప్రారంభమవుతుందని, అప్పటినుంచి ఆమె ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని తెలిపారు.

ఇలా సమంత ఆరోగ్యం గురించి ఈయన మాట్లాడుతూ…ఆమె మరిన్ని అనారోగ్య సమస్యలన్నీ ఎదుర్కొంటుందని చెప్పడంతో అభిమానులు కాస్త ఆందోళన పడినప్పటికీ మరికొందరు మాత్రం ఈయన వార్తలను కొట్టి పారేస్తున్నారు.ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి చెందిన ఒక యంగ్ హీరో హీరోయిన్ చనిపోబోతున్నారు అంటూ ఈయన షాకింగ్ కామెంట్స్ చేశారు.వేణు స్వామి సెలబ్రిటీల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube