ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈనెల 23 నుంచి 25వ తారీకు వరకు కడప జిల్లాలలో పర్యటించనున్నారు.ఈ పర్యటనలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.
రేపు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా ముందుగా కడప పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.అనంతరం ఏపీ పారిశ్రామల శాఖ సలహాదారు రాజోలి వీరారెడ్డి నివాసానికి వెళ్ళనున్నారు.
అనంతరం ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జున రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్ ఖాన్ ల కుటుంబాల జరిగే వివాహ కార్యక్రమాలకు హాజరుకానున్నారు.
అనంతరం కమలాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.
అక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు చేయనున్నారు.ఈ కార్యక్రమాల అనంతరం సీఎం జగన్ ఇడుపులపాయ చేరుకుని రాత్రి వైయస్సార్ గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు.24 వ తారీకు ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.అనంతరం పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఆ తర్వాత ఆహిబిలాపురం పాఠశాల అభివృద్ధి పనులు.ఎంఎల్డి, ఎన్టీపీ, జీటియస్ పనులను ప్రారంభిస్తారు.
ఆ తర్వాత 25వ తారీకు క్రిస్మస్ పండుగ సందర్భంగా పులివెందులలో సిఎస్ఐ చర్చిలో జరిగే ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొంటారు.అనంతరం పులివెందుల నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకొనున్నారు.







