2023 సంక్రాంతి కి తెలుగు ప్రేక్షకుల ముందుకు మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మరియు నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా లతో పాటు విజయ్ హీరో గా నటించిన వారసుడు సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఈ మూడు సినిమా లు కూడా 100 కోట్ల కు పైబడిన బడ్జెట్ తో రూపొందాయి.
అంతే కాకుండా ఈ సినిమా లు వందల కోట్ల వసూళ్ల ను నమోదు చేసే అవకాశం ఉంది అంటూ చాలా నమ్మకం తో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు.విశ్వసనీయం గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూడు సినిమా లు కూడా థియేటర్ రిలీజ్ అయిన 50 రోజుల తర్వాత మాత్రమే ఓటీటీ లో స్ట్రీమింగ్ అవ్వబోతున్నాయని తెలుస్తోంది.
ఆ మధ్య కాలం లో నిర్మాతలు మండలి వారు ఈ కొత్త నిర్ణయాన్ని తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా సక్సెస్ అయినా ఫ్లాప్ అయిన కూడా ఓటీటీ లో చూడాలి అంటే 50 రోజులు ఆగాల్సిందే అంటూ ఆయా చిత్ర నిర్మాతలు మరియు యూనిట్ సభ్యులు చెబుతున్నారు.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలకు సంబంధించిన విడుదల తేదీల విషయం లో ఇటీవలే క్లారిటీ వచ్చింది.అతి త్వరలోనే సినిమా యొక్క విడుదల తేదీలు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా లను ఓటీటీ లో చూడాలంటే చాలా రోజులు వెయిట్ చేయాల్సిందే.అందుకే కచ్చితం గా ఈ సినిమా లను థియేటర్లోనే చూడాలని నిర్మాతలకు ప్రేక్షకులకు సూచిస్తున్నారు.
చిరంజీవి మరియు బాలయ్య సినిమాల విషయంలో నిర్మాతలు చాలా నమ్మకంతో ఉన్నారు.కనుక ఈ రెండు సినిమాలు కూడా విడుదల అయిన 50 రోజుల తర్వాత మాత్రమే ఓటీటీ ద్వారా వచ్చే అవకాశాలు ఉన్నాయి.