టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డులను దక్కించుకుంటుందని రామ్ చరణ్ అభిమానులతో పాటు ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.ఇటీవల ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ తన కథనం లో ఈ సినిమా యొక్క విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతం గా ఉన్నాయని కచ్చితం గా ఆస్కార్ నామినేషన్స్ కి ఎంపిక అయ్యే అవకాశం ఉందని వారు అభిప్రాయం చేశారు.
కానీ తాజాగా విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన షార్ట్ లిస్టు ని అకాడమీ అధికారికం గా విడుదల చేసింది.అందులో మన సినిమా కు సంబంధించిన పేరు లేక పోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఈ సినిమా ఖచ్చితం గా విజువల్ ఎఫెక్ట్స్ కి గాను ఆస్కార్ నామినేషన్ సొంతం చేసుకుంటుందని అవతార్ 2 వంటి హాలీవుడ్ సినిమా లతో నామినేషన్ లో ఉండి అవార్డు రాకున్నా కూడా గొప్ప గౌరవాన్ని పొందబోతుందని అంతా భావించారు.
కానీ అంతా తారుమారు అయింది.
ఎన్నో అంచనాలు పెట్టుకున్న విజువల్ ఎఫెక్ట్స్ కి గాను రాజమౌళి కనీసం నామినేషన్స్ దక్కించుకునే అవకాశం కూడా లేక పోయింది.అయితే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కి గాను షార్ట్ లిస్టులో చోటు దక్కించుకోవడం ఒకింత సంతోషాన్ని కలిగిస్తుంది.
ఇక ఆస్కార్ నామినేషన్స్ విషయం లో ఆశ నిరాశే అంటూ చాలా మంది అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.రాజమౌళి భారీ ఎత్తున ఖర్చు చేసి చాలా కష్టపడ్డా కూడా ఫలితం మాత్రం శూన్యం అంటూ అసహనం వ్యక్తం అవుతుంది.
రాజమౌళి ఇప్పటి వరకు ఈ విషయమై నోరు మెదపడం లేదు.ఆయన కచ్చితంగా నిరాశలోనే ఉండి ఉంటాడు అనడం లో సందేహం లేదు.







