ప్రియుడితో బ్రేకప్ వార్తలపై స్పందించిన శృతిహాసన్.. ఏం చెప్పిందంటే?

టాలీవుడ్ ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.విశ్వ నటుడు కమలహాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది.

 Shruti Haasan Gave Clarity On Breakup With Her Boyfriend Details, Shruti Haasan,-TeluguStop.com

ఇది తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.ఇక గత ఏడాది రవితేజ నటించిన క్రాక్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతోంది.

ప్రస్తుతం శృతిహాసన్ చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే శృతిహాసన్ ప్రస్తుతం వాల్తేరు వీరయ్య, వీర నరసింహారెడ్డి సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.

వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి హీరోగా నటిస్తుండగా, వీర నరసింహారెడ్డి సినిమాలో బాలయ్య బాబు హీరోగా నటిస్తున్నాడు.ఇలా ఇద్దరు అగ్ర హీరోల సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

శృతిహాసన్ నటించిన ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా కేవలం ఒక్కరోజు గ్యాప్ తోనే విడుదలకు సిద్ధమవుతున్నాయి.విడుదల తేదీకి దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను మొదలుపెట్టి కార్యక్రమాల్లో ఉన్నారు.

ఇప్పటికే ఈ సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణ కార్యక్రమాలను జరుపుకుంటున్నాయి.ఈ సినిమాల విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో శృతి హాసన్ తరచుగా వార్తలు నిలుస్తోంది.

Telugu Shruithaasan, Shruti Haasan, Shrutihaasan-Movie

ఈ రెండు సినిమాలు కనుక సూపర్ హిట్ అయితే ఇక శృతిహాసన్ కి తిరుగే ఉండదు అని చెప్పవచ్చు.ఈ రెండింటిలో ఏది హిట్ అయినా కూడా ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు వస్తాయని చెప్పవచ్చు.ఇకపోతే శృతిహాసన్ వ్యక్తిగత విషయానికి వస్తే ఆమె శాంతను హజారికతో గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే.అంతేకాకుండా ప్రస్తుతం ఈ జంట ముంబైలోని ఒక అపార్ట్మెంట్లో నివసిస్తూ సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే తరచూ తన బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ హడావిడి చేసే శృతి హాసన్ ఈమధ్య కాలంలో తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేయకపోవడంతో పలువురు నెట్టిజెన్స్ వారిద్దరికీ లవ్ బ్రేకప్ అయింది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Shruithaasan, Shruti Haasan, Shrutihaasan-Movie

అంతేకాకుండా వారి లవ్ బ్రేకప్ అయ్యింది అంటూ ప్రచారాలు కూడా కొనసాగుతున్నాయి.అందుకు తగ్గట్టుగా శృతిహాసన్ కూడా ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ నాతో నేనే ఉంటాను, అదే నాకు సంతోషం, నా విలువైన సమయాన్ని ప్రేమిస్తాను, ఒంటరితనాన్ని ప్రేమిస్తాను అంటూ శృతిహాసన్ సోషల్ మీడియాలో పోస్టులు చేయడంతో ఆ వార్తలకు మరింత ఆద్యం చేకూర్చినట్టు అయింది.దీంతో శృతిహాసన్ బ్రేకప్ అయ్యింది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించడంతో తాజాగా శృతిహాసన్ తన ప్రియుడితో కలిసి వారిపై వస్తున్న బ్రేకప్ వార్తలకు చెక్ పెట్టేసింది.

తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి క్లోజ్ గా దిగిన ఫోటోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ నేను ఎల్లప్పుడూ కోరుకునేది ఇదే అంటూ క్యాప్షన్ ను కూడా రాసుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube