నేటి దైనందిత జీవితంలో అవసరానికో, అనవసరానికో స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది.దాంతో సోషల్ మీడియా వినియోగం అనేది సహజంగానే పెరిగి పోయింది.
చదువు వున్నవారు కావచ్చు, చదువు లేనివారు కావచ్చు… స్మార్ట్ ఫోన్ అనేది చాలా తేలికగా వాడేస్తున్నారు.అంతే కాకుండా తాము చేసే పనిని… అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు, ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్స్ చేసేస్తున్నారు.
ఈ క్రమంలో కొందరు అభాసుపాలు అవుతున్నారు.
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో వలన అలాంటి ఓ సంఘటనే జరిగింది.
అవును, వైరల్ అవుతున్న వీడియోని గమనిస్తే, తన తల్లితో కలిసి చదువుతున్న ఓ బాలుడు పదేపదే ఏడవడం మనం గమనించవచ్చు.అంతేకాకుండా ఈ వీడియోపై నెటిజన్లు చాలా ప్రతికూలంగా మాట్లాడటం కింద కామెంట్లలో చూడవచ్చు.
చిన్నారికి చదువు చెప్పే తీరు ఇదేనా? నువ్వు ఒక తల్లివేనా? అంటూ మహిళపై మనోళ్లు దాడి చేస్తున్నారు.వైరల్ వీడియోలో చిన్నారి భయపడుతూ హోంవర్క్ చేస్తుండటం గమనించవచ్చు.

పిల్లాడిని భయపెడుతూ తల్లి చదువు నేర్పడం ఇపుడు ఇక్కడ వివాదంలాగా మారింది.1-10 వరకూ కౌంట్ చేసే క్రమంలో తల్లి తనను ఎక్కడ కొడుతుందనే భయం ఆ బాలుడిలో స్పష్టంగా కనిపించింది.మిని చందన్ ద్వివేది అనే యూజర్ ఇన్‌స్టాగ్రాంలో ఈ వీడియోను షేర్ చేయగా అది కాస్త వైరల్ అవుతోంది.ఈ ఘటనపై నెటిజన్లు చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు.
ఆ పిల్లాడి తల్లిని ఉద్దేశిస్తూ… మీరు అలా కోపంతో రగిలిపోతూ ఉంటే మీ కొడుకు ఎంతలా భయపడుతున్నాడో చూడండి… అసలు చదువు చెప్పే తీరు ఇదేనా? అంటూ మండిపడుతున్నారు.







