మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా తమిళ్ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అంటూ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ను మొదట 2023 జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.కానీ కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడంతో విడుదల తేదీ వాయిదా వేశారు.2023 సంవత్సరం సమ్మర్ కానుకగా ప్రేక్షకులు ముందుకు ఈ సినిమా రాబోతున్నట్లుగా తెలుస్తుంది.దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ లో రూపొందుతున్న ఈ సినిమా లో హీరోయిన్ గా కీయారా అద్వానీ మరియు అంజలి నటిస్తున్న విషయం తెలిసిందే.

శ్రీకాంత్ తో పాటు పలువురు నటీనటులు ఈ సినిమా లో కనిపించబోతున్నారు.ఏక కాలంలో తెలుగు మరియు తమిళం లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ఎక్కడి వరకు వచ్చాయి అంటూ మెగా అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం షూటింగ్ కార్యక్రమాలు సగానికి పైగా పూర్తి అయ్యాయి.
సంక్రాంతి తర్వాత చివరి షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.ఫిబ్రవరి వరకు సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలు ముగించాలని దర్శకుడు శంకర్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
మరో వైపు శంకర్ దర్శకత్వం లో ఇండియన్ 2 సినిమా కూడా రూపొందుతున్న విషయం తెలిసిందే.ఆ సినిమా చిత్రీకరణ మరియు చరణ్ సినిమా చిత్రీకరణ సమాంతరంగా చేస్తున్న దర్శకుడు శంకర్ విడుదల విషయం లో ఎలా నిర్ణయం తీసుకుంటాడు అనేది చూడాలి.
రామ్ చరణ్ ఇప్పటికే శంకర్ తర్వాత సినిమా కు కమిట్ అయ్యాడు.ఆ సినిమా యొక్క చిత్రీకరణ వచ్చే సమ్మర్ లో ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.







