సినిమా అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు.అవకాశం రావాలె కానీ ఎలాగైనా నటించాలనే అనుకుంటూ ఉంటారు.
అందులో ముఖ్యంగా హీరోయిన్ అయ్యాక, ఆ గ్లామర్ ప్రపంచంలో అడుగు పెట్టక సినిమా ఇండస్ట్రీ వదిలి ఎవరు వెళ్ళలేరు.కానీ ఇప్పుడు మనం తెలుసుకునే హీరోయిన్స్ దీనికి పూర్తిగా భిన్నం.
ఎందుకంటే సినిమా ఎలా ఉంటుందో ఒక్క సినిమాకే అర్ధం చేసుకొని చేసిన ఒక్క సినిమాతో తూర్పు తిరిగి దండం పెట్టేసి ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోయినా వారు చాలానే ఉన్నారు.వారు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
గిరిజ
మణిరత్నం సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయినా గిరిజ ఆ తర్వాత ములాయం, బాలీవుడ్ లలో అవకాశాలు ఎన్ని వచ్చితిన్ లెక్క చేయకుండా సినిమా వద్దు అంటూ ఇండస్ట్రీ నుంచి ఫారెన్ వెళ్ళిపోయింది.ఆ తర్వాత ఆమె ఇండియా రాను లేదు ఎక్కడ నటించాను లేదు.
SP శైలజ

బాలు చెల్లిగా ఇండస్ట్రీ కి పరిచయం అయినా ఎస్ పి శైలజ మంచి సింగర్ మాత్రమే కాకుండా ప్రొఫెషనల్ క్లాసికల్ డ్యాన్సర్ కూడా.అందుకే ఆమెను నటింపచేయాలని విశ్వనాధ్ పట్టు బట్టి సాగర సంగమం సినిమాలో నటింపచేసారు కానీ ఆ తర్వాత ఆమె ఇండస్ట్రీ అంటే భయపడి కేవలం తెరవెనక పాటలు మరియు గాత్రదానం మాత్రమే చేయడానికి పరిమితం అయ్యింది.
గాయత్రి జోషి

బాలీవుడ్ లో షారుక్ ఖాన్ సరసన నటించిన హీరోయిన్స్ కి ఎంత డిమాండ్ ఉంటుందో మన అందరికి తెలుసు.అంత క్రేజ్ ఉన్న షారుక్ సరసన స్వదేశ్ చిత్రంలో నటించిన గాయత్రి ఆ ఒక్క చిత్రంతోనే నటనను ఆపేసి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయింది.
భమిడిపాటి సబిత
విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన అద్భుతమైన కళాఖండాల్లో సప్తపది సినిమా కూడా ఒకటి.ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన భమిడిపాటి సబిత మంచి క్లాసికల్ డ్యాన్సర్.
ఈ చిత్రం తర్వాత ఎందుకో ఆమె సినిమాల్లో నటించడానికి ఒప్పుకోలేదు.ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో ఆమె తనకు వచ్చిన అవకాశాల గురించి కూడా చెప్పింది.
మహానది శోభన

మహానది సినిమాలో కమల్ హాసన్ కి కూతురు గా నటించింది శోభన అనే అమ్మాయి.ఈ సినిమా తర్వాత ఆమె కూడా ఎక్కడ కనిపించలేదు.పైగా ఆమె ఒక ప్రొఫెషనల్ సింగర్ కావడం తో ఆ చిత్రంలో ఒక అద్భుతమైన పాట కూడా పడింది.ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకుంది.







