పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.3ఎఫ్ ఫుడ్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.పరిశ్రమలో ఆయిల్ ట్యాంకర్ పేలడంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.అయితే ఈ ప్రమాదంలో కొంత మంది కార్మికులు మృతిచెందినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.







